Obulapuram Illegal Mining Case: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు.. వారికి ఏడేళ్లు జైలు శిక్ష, భోరున విలపించిన బీవీ శ్రీనివాస్..

ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో నేరపూరితంగా చొరబడి అక్రమ ఇనుప ఖనిజాలు తవ్వకాలు జరిపారని.. ప్రభుత్వానికి 800 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని..

Obulapuram Illegal Mining Case: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు.. వారికి ఏడేళ్లు జైలు శిక్ష, భోరున విలపించిన బీవీ శ్రీనివాస్..

Updated On : May 6, 2025 / 8:05 PM IST

Obulapuram Illegal Mining Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. దీనిపై సీబీఐ అధికారిక ప్రకటన చేసింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో OMCPL మేనేజింగ్ డైరెక్టర్ తో సహా ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు 7 సంవత్సరల జైలు శిక్ష విధించింది. కంపెనీకి లక్ష రూపాయల జరిమానాతో సహా మొత్తం 1.4 లక్షల జరిమానా విధించింది.

ఈ కేసులో నిందితులు బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి, అలీ ఖాన్, విడి రాజగోపాల్, OMCPL కంపెనీకి శిక్ష విధించారు. నిందితులంతా ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో నేరపూరితంగా చొరబడి అక్రమ ఇనుప ఖనిజాలు తవ్వకాలు జరిపారని సీబీఐ తెలిపింది. ప్రభుత్వానికి 800 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

Also Read: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల వేళ.. మాక్ డ్రిల్ మనం ఎందుకు చేయాలి.. ఎలా చేయాలి? కేంద్రం సందేశాత్మక వీడియో..

డిసెంబర్ 8, 2009లో నిందితులపై సీబీఐ కేసు నమోదు చేసింది. డిసెంబర్ 03, 2011లో సీబీఐ మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2011 నుండి దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ ఇప్పటివరకు మూడు అనుబంధ ఛార్జ్ షీట్ లు దాఖలు చేసింది. విచారణ అనంతరం నిందితులను దోషులుగా పరిగణించిన సీబీఐ కోర్టు వారికి శిక్ష విధించింది.

అటు నిందితుల కుటుంబసభ్యులు కోర్టుకు వెళ్లారు. తమ వాళ్లను పరామర్శించారు. కుటుంబసభ్యులను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు ఏ 1 బీవీ శ్రీనివాస్. ఈ నెల 18న కొడుకు నాగార్జున రెడ్డి వివాహం పెట్టుకున్నారు బీవీ శ్రీనివాస్ రెడ్డి. ధైర్యంగా ఉండాలని తన భార్య, కొడుకు, కూతురికి చెప్పారు గాలి జనార్దన్ రెడ్డి. నిందితులను చర్లపల్లి జైలుకి తరలించారు.