పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల వేళ.. మాక్ డ్రిల్ మనం ఎందుకు చేయాలి.. ఎలా చేయాలి? కేంద్రం సందేశాత్మక వీడియో..
దేశ రక్షణ అంటే బోర్డర్ లో ఉండే వారి కోసం మాత్రమే కాదు.. ఇండియాలోని ప్రతి ఒక్కరి సేఫ్టీ అనేది భారత ప్రభుత్వ లక్ష్యం.

India Safety: పాకిస్తాన్ తో ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా 244 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. అయితే, ఈ మాక్ డ్రిల్ ఎందుకు చేస్తారు? దీని వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? నష్టం ఏంటి? అసలు చేయకపోతే ఏం జరుగుతుందనే సందేహం చాలామందిలో ఉంది.
ఎక్కడో బోర్డర్ లో యుద్ధం జరుగుతుంది కదా.. అక్కడ సైనికులు కదా పోరాడేది మనం ఎందుకు ఇలాంటివన్నీ చేయాలనే సందేహాలు కూడా చాలా మందిలో ఉంటాయి. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కి, హైదరాబాద్ – విశాఖపట్నం లాంటి నగరాలకి చాలా దూరం ఉంటుంది కదా.. మనకెందుకు ఇవన్నీ అనే డౌట్స్ కూడా వస్తుంటాయి.
ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక వీడియో రిలీజ్ చేసింది. ఎయిర్ స్ట్రైక్ బ్లాకౌట్ ఎలా చేయాలో అందులో వివరించింది. దేశ రక్షణ అంటే బోర్డర్ లో ఉండే వారి కోసం మాత్రమే కాదు.. ఇండియాలోని ప్రతి ఒక్కరి సేఫ్టీ అనేది భారత ప్రభుత్వ లక్ష్యం. దేశ ప్రజల భద్రత కోసం ఈ పనులను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆదేశించింది.
ఎయిర్ రైడ్ అలారం, బ్లాక్ ఔట్ ప్లాన్
ఎయిర్ రైడ్ అలారం అంటే మనం ఫ్యాక్టరీల్లో సైరన్లు మోగినట్టు పెద్దగా మోగుతాయి. మనం ఆ క్షణంలో ఏం చేస్తున్నా సరే వెంటనే అలర్ట్ అయిపోవాలి. ఆఫీసులో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, మార్కెట్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పిల్లలు ఆడుకుంటున్నా.. ఏ స్థితిలో ఉన్నా కూడా వెంటనే అలర్ట్ అవ్వాలి. ప్రభుత్వం చెప్పినట్టుగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలి. వెంటనే బ్లాక్ ఔట్ ఆపరేషన్ అమలు చేయాలి.
బ్లాక్ ఔట్ అంటే..
సైరన్ మోగగానే అందరూ ఇళ్లల్లో లైట్లు మొత్తం ఆపేయాలి.
ఫ్యాన్లు ఆపేయాలి.
కర్టెన్లు వేసేయాలి.
తలుపులు మూసేయాలి.
ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే వెంటనే నలుగురూ తలో పని చేసేయాలి.
అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి.
అలాగే, ఇంటి లోపల దీపాలు లాంటివి వెలిగించొద్దు.
ఫోన్ల లైట్లు కూడా ఒక రకంగా ప్రమాదమే.
అంతా ఒకే దగ్గర నిశ్శబ్దంగా కూర్చోవాలి.
చిన్న వెలుతురు కూడా మనకు ముప్పుగా మారొచ్చు.
ఎక్కడైనా వెలుగు గమనిస్తే అక్కడ ప్రత్యర్థి బాంబ్స్ తో ఎటాక్ చేసే ప్రమాదం ఉండొచ్చు.
కాబట్టి కచ్చితంగా ఇవన్నీ పాటించాలి.
మరి వీధి దీపాల పరిస్థితి ఏంటనే డౌట్ రావొచ్చు. అయితే, దానికి సంబంధించి ప్రభుత్వం, అధికారులు ఆల్రెడీ ప్లాన్ చేస్తారు. కాబట్టి డోంట్ వర్రీ.
ఇవన్నీ చేయడం అంటే ప్రజలను భయపెట్టడమే అనే అపోహ చాలా మందికి ఉంటుంది. అయితే, ఇది ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడానికి చేసే సన్నద్ధత మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి.
పొరపాటున బిల్డింగ్ పైన ఎక్కడైనా లైట్ వెలుగుతుందా? చుట్టుపక్కల వాళ్లు అంతా సేఫేనా అని వాలంటీర్లు చెక్ చేస్తారు. ఒక రకంగా ప్రతి ఇల్లూ ప్రత్యర్థికి అంతుచిక్కని ఒక కోటలాగా మారాలన్నమాట. ఇక్కడ మనం మనోధైర్యం కోల్పోకూడదు. చీకట్లో ఉండడం అంటే దాక్కోవడం కాదు. మనం ఐకమత్యంగా ఉండడం. మన కుటుంబం, మన వీధి, మన ఊరు.. ఇలా ప్రతి ఒక్కరూ మరొకరికి ప్రమాదాన్ని తీసుకురానివ్వకుండా యూనిటీగా ఉండడం. ఇది మన కోసం.. మన దేశం కోసం. అందరూ తప్పకపాటించాలి.
ఫైనల్ గా సైలెంట్ గా ఉండండి.. సేఫ్ గా ఉండండి.
మాక్ డ్రిల్ మనం ఎందుకు చేయాలి.. ఎలా చేయాలి? కేంద్ర సందేశాత్మక వీడియో | 10TV#India #IndiaPakistanTensions #IndiaPakistanWar #MockDrill #CentralGovernment #PMNarendraModi #10TV pic.twitter.com/6Bdkpy6eQ7
— 10Tv News (@10TvTeluguNews) May 6, 2025