ONGC Gas Leak : కోనసీమలో కలకలం రేపిన మంటలు.. 8గంటల తర్వాత అదుపులోకి, వాటంతట అవే..
ONGC Gas Leak : ఈ ఉదయం 5 గంటలకు ఓ రైతు తన పొలంలో బోర్ ఆన్ చేయగా ముందు తెల్లని ద్రవం బయటకు వచ్చింది. ఆ తర్వాత గ్యాస్ లీక్ అయ్యి మంటలు ఎగిసిపడ్డాయి.

ONGC Gas Leak
Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులో మంటలు అదుపులోకి వచ్చాయి. వాటంతట అవే మంటలు ఒక్కసారిగా ఆగిపోయాయి. దాదాపు 8 గంటల పాటు గ్యాస్ లీక్ అయ్యి మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఎగిసిపడ్డ ప్రాంతంలో వాటర్ పంపింగ్ చేస్తూ ఏమైనా గ్యాస్ ఉందా? అని అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
నర్సాపురం నుంచి వచ్చిన ప్రత్యేక ఓఎన్ జీసీ బృందం మంటల వ్యాప్తికి కారణాలు పరిశీలిస్తోంది. బోరు బావి 350 అడుగుల లోతుగా ఉండటంతో గ్యాస్ లీక్ అయినట్లు గుర్తించారు అధికారులు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఓఎన్జీసీ గ్యాస్ పైపు లైన్లు లేవని అధికారులు నిర్ధారించారు. ఈ ఉదయం 5 గంటలకు ఓ రైతు తన పొలంలో బోర్ ఆన్ చేయగా ముందు తెల్లని ద్రవం బయటకు వచ్చింది. ఆ తర్వాత గ్యాస్ లీక్ అయ్యి మంటలు ఎగిసిపడ్డాయి.
సుమారు 8 గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడేం జరుగుతుందోనని బాగా భయపడ్డారు. చివరికి మంటలు వాటంతట అవే అదుపులోకి రావడంతో అంతా స్థానికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రంగంలోకి దిగిన ఓఎన్జీసీ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఇంకా గ్యాస్ ఉందేమోనని చెక్ చేస్తున్నారు.
ఎక్కడి నుంచి అయితే మంటలు చెలరేగాయో ఆ బోరు బావులోకి నీరు పంపిస్తున్నారు. అసలు గ్యాస్ ఎలా లీక్ అయ్యింది? ఎక్కడి నుంచి లీక్ అయ్యింది? అనేదానిపై ఆరా తీస్తున్నారు. సుమారు 8గంటల పాట మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం అంతా పూర్తిగా పాడైపోయింది. అత్యధిక పీడనంతో వాయు నిక్షేపాలు బయటకు వచ్చాయి. ఐదేళ్ల క్రితం అక్కడ బోరు వేశారు. 350 అడుగుల బోరు బావి వేశారు. 50 అడుగుల లోపల వాటర్ ని బయటకు పంపింగ్ చేసేందుకు ఓ మోటర్ కూడా ఉంది. దానికి కరెంట్ కనెక్షన్ కూడా ఉంది. దీనికి సంబంధించి ఒక్కసారిగా గ్యాస్ లీకై ఫైర్ అయ్యింది. మొత్తంగా మంటలు వాటంతట అవే అదుపులోకి రావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అధికారులు భావిస్తున్నారు.