వీరు మనుషులేనా : బాలుడిపై యువకుల అత్యాచారం

తెలుగు రాష్ట్రాల్లో దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరిస్తున్నారు కొందరు కామాంధులు. వావి వరుసలు కూడా మరుస్తున్నారు. అభం శుభం తెలియని పసిమొగ్గల నుంచి వృద్ధులపై దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా అవుకులో నలుగురు యువకుల పైశాచికత్వం బయటపడింది.
14 సంవత్సరాలున్న బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆ బాలుడు అస్వస్థతకు గురికావడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
సైకోలా వ్యవహరించారు.
బుల్లెట్ రాజ్, ప్రేమ్ కుమార్, రాజా, సునీల్ అనే వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు బాలుడిని బెదిరించారు. మూడు రోజుల క్రితం ఆ బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుల కోసం గాలించారు. నిందితుల్లో ఇద్దరు (బుల్లెట్ రాజ్, ప్రేమ్ కుమార్) దొరకగా..మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై మండల వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More : కరోనా రాకుండా ఉండాలంటే..ఈ మంత్రం జపించండి..దలైలామ సూచన