స్మశానంలో పూడ్చిపెడుతుండగా ఒక్కసారిగా ఏడ్చిన పసికందు.. కాటికాపరి చేసిన పనికి వారు పరార్..

  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత బిడ్డను బంతికుండగానే స్మశానంలో పాతిపెట్టేందుకు

స్మశానంలో పూడ్చిపెడుతుండగా ఒక్కసారిగా ఏడ్చిన పసికందు.. కాటికాపరి చేసిన పనికి వారు పరార్..

Graveyard

Updated On : January 30, 2025 / 2:54 PM IST

West Godavari District:  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత బిడ్డను బంతికుండగానే స్మశానంలో పాతిపెట్టేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. ప్రాణాలతో ఉన్న పసికందును పూడ్చిపెట్టే ప్రయత్నంలో ఆ బిడ్డ ఒక్కసారిగా ఏడ్చింది. బిడ్డ అరుపులు విన్న కాటికాపరి వారివద్దకు వచ్చి చూడగా అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే..

 

ఈనెల 28వ తేదీన తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సంధ్య కుమారి అనే మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, బిడ్డకు తలలో ప్రాబ్లంగా ఉందని వైద్యులు తల్లిదండ్రులకు తెలిపారు. మీ బిడ్డ తలలో ఇబ్బంది తొలగిపోవాలంటే వైద్యం చేయాలని, అందుకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆ బిడ్డకు చికిత్స చేయించే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవటంతో దారుణానికి ఒడిగట్టేందుకు పూనుకున్నారు. చికిత్స చేయించకుండా బతికుండానే ఆ పసికందును పూడ్చిపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. స్మశాన వాటికలో పూడ్చిపెట్టాలని భావించి స్మశాన వాటిక వద్దకు వెళ్లారు.

 

పసికందును స్మశానంలో పూడ్చిపెట్టేందుకు ప్రయత్నిస్తుండగా బిడ్డ అరుపులు వినిపించడంతో కాటికాపరికి అనుమానం వచ్చింది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చేసరికి ఒకరు పారిపోవడంతో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారు బాదంపూడికి చెందిన వారిగా గుర్తించారు. పసికందును స్వాధీనం చేసుకున్న పోలీసులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు.