Dwarampudi Chandrasekhara Reddy : రెడ్లు, కాపుల మధ్య గొడవలు పెట్టేందుకు పవన్, చంద్రబాబు కుట్ర- ఎమ్మెల్యే ద్వారంపూడి

Dwarampudi : మేము గొడవ చేస్తే దానిని రాష్ట్ర స్థాయిలో రెడ్లు, కాపుల మధ్య గొడవ పెడదామని వ్యూహం రచించారు.

Dwarampudi Chandrasekhara Reddy : రెడ్లు, కాపుల మధ్య గొడవలు పెట్టేందుకు పవన్, చంద్రబాబు కుట్ర- ఎమ్మెల్యే ద్వారంపూడి

Dwarampudi Chandrasekhara Reddy (Photo : Google)

Updated On : June 20, 2023 / 6:28 PM IST

MLA Dwarampudi – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటారు. సవాళ్లు విసురుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. వారాహి యాత్రలో భాగంగా తనపై పవన్ చేసిన విమర్శలు, ఆరోపణలకు ఘాటుగా బదులిచ్చారు ఎమ్మెల్యే ద్వారంపూడి. తాజాగా మరోసారి పవన్ పై ఆయన విరుచుకుపడ్డారు. రెడ్లు, కాపుల మధ్య గొడవలు పెట్టాలని పవన్ కల్యాణ్, చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి ఆరోపించారు.

నేను చేసిన చాలెంజ్ కి ఇంతవరకు పవన్ కల్యాణ్ స్పందించలేదని, తోక ముడుచుకుని వెళ్ళిపోతున్నారని ద్వారంపూడి అన్నారు. పవన్ కల్యాణ్ తనపై పోటీ చేయకపోతే పవన్ మాట్లాడిన మాటలు అబద్ధమని తేలిపోతాయన్నారు. ఏదైనా మాట్లాడుతున్నాం అంటే అందులో సంస్కారం ఉండాలని పవన్ కు హితవు పలికారు ద్వారంపూడి. చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ చేస్తున్న కుట్రలు ఇక్కడ చెల్లవని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు చేతిలో జనసేన రిమోట్ ఉందన్న ఆయన.. ముద్రగడ పద్మనాభం చెప్పినట్లుగా కాకినాడలో తనపై పవన్ పోటీ చేయాలని మరోసారి సవాల్ విసిరారు.

Also Read..Eluru Constituency: ఏలూరులో వైసీపీ టికెట్ ఆయనకేనా.. జనసేనకు ఏలూరు పట్టం కడుతుందా.. టీడీపీ పరిస్థితేంటి?

ఎమ్మెల్యే ద్వారంపూడి కామెంట్స్..
” చంద్రబాబు ఆడిస్తే పవన్ ఆడుతున్నారు. చంద్రబాబు కులాలను విడగొట్టే ప్రయత్నం చేస్తారు. నా వర్గం మనుషులు వెళ్లి అల్లరి చేస్తారని ఉద్దేశ పూర్వకంగా మాట్లాడారు. మేము గొడవ చేస్తే దానిని రాష్ట్ర స్థాయిలో రెడ్లు, కాపుల మధ్య గొడవ పెడదామని వ్యూహం రచించారు. ముద్రగడ పద్మనాభం మా కుటుంబంపై స్పందించినందుకు ధన్యవాదాలు”.

వంగా గీత, ఎంపీ
పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు. పవన్ మాట్లాడిన తీరుని అంతా తప్పుపడుతున్నాం. ఎమ్మెల్యే ద్వారంపూడి, సీఎం జగన్ పై పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమంతా మామూలు వ్యక్తులం కాదు.
ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చాం. తన మాటలతో యువతకు పవన్ ఏం సందేశం ఇస్తున్నారు? పవన్ వ్యవహారశైలి ఏమాత్రం హర్షణీయం కాదు.

Also Read..Pawan Kalyan : ముస్లింలతో సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు