YCP- Janasena: ఏపీలో బైజూస్ వ్యవహారంపై పొలిటికల్ ఫైట్.. వైసీపీ, జనసేన మధ్య ట్విటర్ వార్
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్న జనసేనాని ఇప్పుడు బైజూస్‌పై సైతం కామెంట్స్ చేయడం పొలిటికల్ హీట్ పెంచుతోంది.

Pawan Kalyan, Botsa Satyanarayana twitter war
YCP- Janasena twitter war : ఏపీలో వాలంటీర్ వార్ ముగియకు ముందే.. బైజూస్ (Byjus) వార్ మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల్లో బైజూస్ ఆన్లైన్ క్లాసులు (Online Class), కంటెంట్, ట్యాబ్లపై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రశ్నలపై పొలిటికల్ హీట్ (Political Heat) రాజుకుంది. జనసేన, వైసీపీ మధ్య ఈ వ్యవహారం కాకపుట్టిస్తోంది. జనసేనాని, మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ట్వీట్.. రీట్వీట్లతో కౌంటర్లు వేసుకుంటున్నారు.
ఏపీలో వైసీపీ, జనసేన మధ్య ట్విటర్ వార్ ముదురుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య బైజూస్ వార్ నడుస్తోంది. ప్రభుత్వ పాఠశాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన బైజూస్ ఆన్లైన్ క్లాసులు, కంటెంట్, ట్యాబ్లపై పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న కంపెనీతో ఒప్పందాలు చేసుకోవడంపై పవన్ మండిపడ్డారు. నష్టాల్లో ఉన్న బైజూస్ కంపెనీకి కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చారని ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధించారు.
పవన్ ప్రశ్నలపై మంత్రి బొత్స సత్యనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బైజూన్‌తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై క్లారిటీ ఇచ్చారు. గూగుల్ సెర్చ్ చేసి చూసుకోవచ్చిన ఓ వెబ్ సైట్‌ను షేర్ చేశారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్‌కు ట్యూషన్ చెప్తానికి తాను రెడీ అని, కానీ హోంవర్క్ చేస్తానని పవన్ హామీ ఇవ్వాలని షరతు విధిస్తూ మంత్రి బొత్స ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Also Read: అదే జరిగితే పార్టీలో ఉండను- పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన ప్రకటన
బొత్స సత్యనారాయణ సెటైర్‌కు పవన్ కల్యాణ్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ ట్వీట్‌కు రీట్వీట్ చేశారు. జైజూస్‌ను టీచర్లు వ్యతిరేకిస్తున్నారంటూ మీడియాలో వచ్చిన లింక్‌ను ట్యాగ్ చేశారు పవన్. అలాగే ట్యాబ్‌లు, కంటెంట్ విషయంలో పవన్ కల్యాణ్ మరికొన్ని ప్రశ్నలు సంధించారు.
Also Read: కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. శాస్త్రోక్తంగా భూమి పూజ
ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్న జనసేనాని ఇప్పుడు బైజూస్‌పై సైతం కామెంట్స్ చేయడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. వాలంటీర్ వ్యవస్థపై గత ప్రభుత్వం డేటా సేకరణపై జగన్ ప్రసంగాన్ని ట్వీట్ చేశారు? డేటా ప్రైవసీ చట్టాలు మీరు సీఎంగా ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటాయన్న పవన్.. అసలు వాలంటీర్లకు బాస్ ఎవరంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రజల పర్సనల్ డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు డేటా సేకరించే అధికారం వాలంటీర్లకు ఎవరిచ్చారని పవన్ ప్రశ్నించారు. ఒకదాని తర్వాత ఒక అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తుంటే.. అంతే స్థాయిలో వైసీపీ కౌంటర్ ఇస్తోంది.