Pawan Kalyan: మీకు జగన్ ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి.. నా సినిమాల టికెట్ల రేట్లు తగ్గించడానికి కారణమిదే..: పవన్

తాను వెళ్లి సినిమా విడుదల అవుతుంది, కొంచెం టికెట్ల రేట్లు పెంచండని వేడుకుంటే..

Pawan Kalyan: మీకు జగన్ ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి.. నా సినిమాల టికెట్ల రేట్లు తగ్గించడానికి కారణమిదే..: పవన్

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి కారణం వారి దగ్గర డబ్బులు ఉండకూడదు అని సీఎం జగన్ భావించడమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. అలాగే, తన సినిమాలకు టికెట్ల రేట్లు తగ్గించడానికి కారణం తన దగ్గర డబ్బులు ఉండకూడదు అని భావిస్తున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు.

జగన్ మన గురించి ఇలా ఆలోచిస్తారని అన్నారు. అందరూ ఆయన దగ్గర దేహీ అని ఉండాలి అనుకుంటారని చెప్పారు. తాను వెళ్లి సినిమా విడుదల అవుతుంది, కొంచెం టికెట్ల రేట్లు పెంచండని వేడుకుంటే వైఎస్ జగన్ కు ఆనందంగా ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు. సినిమాలు ఆపుకుంటే ఆపుకోవాలని, భయపడతా అనుకుంటున్నారా అని జగన్ ని పవన్ ప్రశ్నించారు. తాను భగత్ సింగ్ వారసుడిని, జగన్ కి భయపడే వాడిని కాదని పవన్ కల్యాణ్ అన్నారు.

ప్రజలు తమ 5 సంవత్సరాల విలువైన కాలాన్ని కోల్పోతే తిరిగిరాదని, జగన్ కు ఒక 5 సంవత్సరాలు అధికారం లేకపోయినా పర్లేదని చెప్పారు. ప్రజలు తమ విలువైన 5 సంవత్సరాల కాలం కోసం తనకు అవకాశం ఇవ్వాలని అన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి చూపిస్తానని చెప్పారు. 10 ఏళ్లుగా తాను ప్రజల కోసం నిలబడి ఉన్నానని, ఎక్కడికీ పారిపోలేదని తెలిపారు. ఒక్కసారి ప్రజల భవిష్యత్తు కోసం మాకు అవకాశం ఇవ్వాలని కోరారు.
Pawan Kalyan: చాలా బెదిరింపులు వస్తున్నాయి: పవన్ కల్యాణ్ కామెంట్స్