Pawan Kalyan: టార్గెట్ జాబ్ క్యాలెండర్.. జనసేనాని పోరాటం!
గత కొద్దిరోజులుగా సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈనెల 20వ తేదీన జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ నేతలకు పిలుపునివ్వగా..

Pawan Kalyan Protest Against Job Calendar In Ap
Pawan Kalyan: గత కొద్దిరోజులుగా సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈనెల 20వ తేదీన జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ నేతలకు పిలుపునివ్వగా.. 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, ఆ హామీని నమ్మిన యువత మోసపోయిందని పవన్ విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో వైకాపా చెప్పిన మాటలు నమ్మిన నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ను చూసి నిరాశకు గురైందన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు చెప్పారని పవన్ ఆరోపించారు.
అందుకోసమే నిరుద్యోగుల పక్షాన జనసేన పోరాటం చేస్తుందన్న పవన్ కళ్యాణ్ యువత ఎన్నో కష్టనష్టాలకోర్చి గత రెండేళ్లుగా ఉద్యోగాల కోసం, అందుకు సంబంధించిన పోటీ పరీక్షలకోసం సన్నద్ధమవుతున్నారు. ఏపీలో ఉన్న అన్ని శాఖల్లో ఖాళీలు భర్తీ చెయ్యాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2లలో కేవలం 36 పోస్టులు మాత్రమే చూపించడం నిరుద్యోగులను వంచించటమేనని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయ పోస్టులు వేలల్లో ఖాళీగా ఉన్నాయని, సీఎం చెప్పిన మెగా డీఎస్సీ ఏమై పోయిందని నిలదీశారు. పోలీస్ శాఖలో 7 వేలకు పైగా ఖాళీగా ఉండగా వాటిని భర్తీ చేయరా అని ప్రశ్నించారు.