Pawan Kalyan: ఎన్నికల్లో గెలిచాక మన రాజోలు జనసేన ఎమ్మెల్యేలాగా పారిపోకూడదు.. ఏం చేయాలంటే?: పవన్

రాజోలు నియోజక వర్గాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. జనసనకు రాజోలు వెలుగు నిచ్చిందని...

Pawan Kalyan: ఎన్నికల్లో గెలిచాక మన రాజోలు జనసేన ఎమ్మెల్యేలాగా పారిపోకూడదు.. ఏం చేయాలంటే?: పవన్

Pawan Kalyan

Updated On : June 24, 2023 / 9:04 PM IST

Pawan Kalyan – Razole: ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District) పి. గన్నవరం నియోజకవర్గం జనసేన (JanaSena) నేతలతో దిండి రిసార్ట్స్ లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యేలాగా పారిపోకూడదని, గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో ఓడిపోతే ఒక్క రాజోలులో మాత్రమే గెలిచామని పవన్ అన్నారు. రాజోలు నియోజక వర్గాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. జనసనకు రాజోలు వెలుగు నిచ్చిందని తెలిపారు.

ఆ నియోజకవర్గంతో పాటు పి.గన్నవరం ఇకపై తన వ్యక్తిగత పర్యవేక్షణలో ఉంటాయని అన్నారు. పి.గన్నవరం, రాజోలులో ఇసుక తిప్పలు రోడ్డు పక్కన్నే కొండల్లా వేశారని విమర్శలు గుప్పించారు. గోదావరి జిల్లాలు అన్ని జిల్లాలకు అన్నం పెడతాయని, అందుకే తాను జనసేన వారాహి విజయ యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించానని తెలిపారు.

పార్టీ కోసం కష్టపడిన వాళ్లందరినీ గుర్తిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ సారి పి.గన్నవరంలో జనసేన జెండా ఎగరాలని అన్నారు. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని హత్య చేస్తే చట్టాలు ఏమయ్యాయని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. నేరాలు చేసే వారిని నిలదీస్తామని చెప్పారు.

Also Read..

Somu Veerraju : టీడీపీతో పొత్తుపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

రాజోలును తిరిగి జనసేన కైవసం చేసుకుంటుందా?