Pawan Kalyan: రేషన్ బియ్యం కేసు.. పేర్ని నాని వ్యవహారంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టారు.. ఇప్పుడు నీతులు చెబితే ఎలా..? అంటూ ప్రశ్నించిన పవన్.. చట్టం ప్రకారం ఆ కేసులో చర్యలు ఉంటాయని అన్నారు.

Pawan Kalyan
AP Deputy Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా రేషన్ బియ్యం మాయం కేసు.. వైసీపీ నేత పేర్ని నాని వ్యవహారంపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం మాయమైంది నిజం. డబ్బులు కట్టింది వాస్తవం. డబ్బులు కట్టేశాం అంటే ఎలా? తప్పు జరిగింది కదా. తప్పు జరిగింది కాబట్టే కేసు పెట్టారు. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోడౌన్ పెట్టింది ఎవరు..? చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను మీరు తిట్టలేదా? మేము ఆడవాళ్లను కేసులో ఇరికించలేదే. ఆయన చేసిన తప్పుకు వాళ్ల ఇంట్లోవాళ్లను వీధిలోకి తెచ్చారు అంటూ పవన్ అన్నారు.
Also Read : Pawan Kalyan: రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్.. అల్లు అర్జున్ వ్యవహారంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టారు.. ఇప్పుడు నీతులు చెబితే ఎలా..? అంటూ ప్రశ్నించిన పవన్.. చట్టం ప్రకారం ఆ కేసులో చర్యలు ఉంటాయని అన్నారు. అటవీ శాఖలో జరుగుతున్న స్మగ్లింగ్ దారుణాలు ఎక్కడా లేవన్న పవన్.. నాకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. త్వరలోనే బలమైన యాక్షన్ ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: Pawan kalyan – Dil raju : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ..
పేర్ని నాని సతీమణి పేరుపై ఉన్న గోదాంలో రేషన్ బియ్యం స్టాక్ లో తేడాలున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు గోదా యాజమాని అయిన పేర్ని నాని సతీమణి పైన, మరొకరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పేర్ని నాని, ఆయన కుమారుడు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే, రెండు రోజుల క్రితం పేర్ని నాని మీడియా సమవేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, తన కుటుంబంపై కావాలనే రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు.
Also Read: సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన యనమల రామకృష్ణుడు .. ఎందుకంటే?
గోదాంలో తగ్గిన రేషన్ బియ్యానికి రూ. 1.78కోట్లు కట్టాలని సివిల్ సప్లయ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ డబ్బును చెల్లించాం. అయినా నా భార్యపై క్రిమినల్ కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేనెక్కడికీ పారిపోలేదు. ఇంట్లో ఆడవాళ్లపై కేసులు పెట్టారు కనుక రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నానని అన్నారు. ఇంట్లో ఆడవాళ్ల జోలికెందుకు వస్తారు.. రాజకీయ కక్ష ఉంటే నన్ను, నా కొడుకును అరెస్టు చేయండి అంటూ కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. బియ్యం మాయమైంది నిజమే కదా.. డబ్బులు కట్టాం.. కేసులు ఎందుకు పెట్టారు అంటే ఎలా కుదురుతుంది అంటూ పవన్ కౌంటర్ ఇచ్చారు.