Pawan Kalyan : ఇంగ్లీష్ ఉండాలి కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషా దినోత్సవంని విజయవాడలో ఘనంగా నిర్వహించింది.

Pawan Kalyan : ఇంగ్లీష్ ఉండాలి కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..

Pawan Kalyan Sensational Comments on Telugu and English Languages

Updated On : August 30, 2024 / 7:06 AM IST

Pawan Kalyan : నిన్న ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషా దినోత్సవంని విజయవాడలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్, పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు.

వ్యావహారిక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారికి నివాళులు అర్పిస్తూ ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం.

Also Read : Rajinikanth – Nagarjuna : రజినీకాంత్ సినిమాలో నాగార్జున.. కింగ్ పుట్టిన రోజు గిఫ్ట్ ‘సైమన్’..

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాకే ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగు మాట్లాడలేకపోతున్నాము. మరాఠి, తమిళ్ లో ఇంగ్లీష్ పదాలు ఒక్కటి కూడా వాడకుండా శుద్ధమైన మాతృభాష మాట్లాడతారు. వారు వాళ్ళ భాషపై ప్రయోగాలు చేస్తారు. మన దగ్గర మనం ఎంత చేయగలమో తెలియదు కానీ మాతృభాషకు మాత్రం మనం పెద్దపీట వేయకపోతే చేజేతులా మన భాషని మనమే నాశనం చేసుకున్నట్టే. అలాగే పిల్లలు, యువత తెలుసుకోవాలి ఇంగ్లీష్ మాట్లాడితేనే చదువులు కాదు. ఇంగ్లీష్ ఉండాలి కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు. ఇంగ్లీష్ లేకపోతే బతుకు లేదు అనేది ఏం లేదు. ఇంగ్లీష్ చదివితేనే తెలివి తేటలు వస్తాయి, బతుకుతాం అనే దుస్థితి నుంచి మనం బయటపడాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు. దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.