Pawan Kalyan : మురుగన్ నేలపై అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. పంచెకట్టుతో లుక్ అదుర్స్..

నేడు పవన్ కళ్యాణ్ తమిళనాడు వెళ్లారు.

Pawan Kalyan : మురుగన్ నేలపై అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. పంచెకట్టుతో లుక్ అదుర్స్..

Pawan Kalyan Went to Tamilnadu with Panchekattu Photos goes Viral

Updated On : June 22, 2025 / 2:08 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉపముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో, ముఖ్యంగా గ్రామాల్లో పలు సమస్యలను తీరుస్తూ దూసుకుపోతున్న పవన్ దేశ రాజకీయాల్లో కూడా బీజేపీ సహకారంతో మరింత ఎదుగుతున్నారు. ఏపీలోనే కాకుండా దేశమంతా రాజకీయంగా పవన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

నేడు పవన్ కళ్యాణ్ తమిళనాడు వెళ్లారు. తమిళనాడు రాష్ట్రంలో మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో నేడు మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమం గ్రాండ్ గా జరగనుంది. ఈరోజు సాయంత్రం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అతిధిగా పాల్గొనబోతున్నారు.

Pawan Kalyan Went to Tamilnadu with Panchekattu Photos goes Viral

Also Read : Salman khan : వామ్మో ఇన్ని హెల్త్ సమస్యలతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్.. సంపాదనలో సగం పైన చికిత్సకే..

దీనికోసమే కొద్దిసేపటి క్రితం మధురై విమానాశ్రయంకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అయితే పవన్ తమిళనాడు స్టైల్ లో పంచెకట్టులో కనిపించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంచెకట్టుతో విమానం నుంచి దిగుతున్న పవన్ లుక్స్ అదిరిపోయాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Rocking Rakesh – Sujatha : జబర్దస్త్ రాకింగ్ రాకేష్ – సుజాత కూతురు అన్నప్రాసన వేడుక.. ఫొటోలు..