Salman khan : వామ్మో ఇన్ని హెల్త్ సమస్యలతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్.. సంపాదనలో సగం పైన చికిత్సకే..
సల్మాన్ ఖాన్ కి అనేక హెల్త్ సమస్యలు ఉన్నాయని చెప్పి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు.

Salman khan Effected with so Many Health Issues Fans Shocked
Salman khan : బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే టక్కున సల్మాన్ ఖాన్ పేరే చెప్తారు. 59 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి టాపిక్ గురించి మాట్లాడట్లేదు. గతంలో కొన్ని లవ్ అఫైర్స్ ఉన్నా పెళ్లిదాకా ఏది వెళ్ళలేదు. దీంతో సల్మాన్ లైఫ్ లో పెళ్లి లేదు అనుకొనే జీవితాన్ని సినిమాలతో కొనసాగిస్తున్నాడు. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ షోలో అనేక ఆసక్తికర అంశాలను తెలిపాడు.
సల్మాన్ ఖాన్ కి అనేక హెల్త్ సమస్యలు ఉన్నాయని చెప్పి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ తన హెల్త్ సమస్యల గురించి చెప్తూ.. సినిమాల్లో చాలా సార్లు నా ఎముకలు, పక్కటెముకలు విరిగిపోయాయి. నాకు ట్రైజెమినల్ న్యూరల్జియా ఉన్నప్పటికీ నేను పని చేస్తున్నాను. నాకు మెదడులో అనూరిజం ఉంది. రక్తనాళాలకు సంబంధించిన వైకల్యం(AV మాల్ ఫార్మేషన్) ఉంది. అయినా నేను ఇంకా పనిచేస్తున్నాను. వీటివల్ల నేను సంపాదించే దాంట్లో సగం వీటికే పోతుంది. ఇదంతా చిన్నప్పుడు జరిగి ఉంటే అంతా తిరిగి సంపాదించుకునేవాడిని. ఇప్పుడు కూడా మళ్ళీ మొదటి నుంచి మొదలుపెడతాను అని తెలిపారు.
Also See : Rocking Rakesh – Sujatha : జబర్దస్త్ రాకింగ్ రాకేష్ – సుజాత కూతురు అన్నప్రాసన వేడుక.. ఫొటోలు..
ట్రైజెమినల్ న్యూరల్జియా అంటే ఇది నరాలకు సంబంధించిన వ్యాధి. దీనివల్ల ఎక్కువగా ముఖానికి సంబంధించిన నొప్పి, నరాలకు సంబంధించిన నొప్పి వస్తుంది. AV మాల్ ఫార్మేషన్ అంటే రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి. దీనివల్ల మెదడు, వెన్నుముకకు రక్తం సరఫరా అయ్యే రక్తనాళాల్లో అడ్డంకులను సృష్టిస్తుంది. బ్రెయిన్ అనూరిజం అంటే మెదడులోని రక్తనాళాల్లో బలహీనత ఏర్పడి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. దీంతో సల్మాన్ ఖాన్ కి ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. వాటి నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Also See : Keerthy Suresh : యోగా డే.. కీర్తి సురేష్ యోగాసనాలు చూశారా..?