Pawan Kalyan : నేటి నుంచి జనసేనాని విశాఖలో పర్యటన… స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పవన్
విశాఖ ఉక్కు ఉద్యమంలో జనసేనాని భాగం కానున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై తన గళం వినిపించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు.

Pawan Kalyan (1)
Pawan Kalyan Visakhapatnam tour : విశాఖ ఉక్కు ఉద్యమంలో జనసేనాని భాగం కానున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. కేంద్రంపై తన గళం వినిపించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటానికి సంఘీభావం ప్రకటించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించారు.
వేదికపై పవన్‌తో పాటు కార్మిక సంఘాల నాయకులు మాత్రమే ఉండనున్నారు. బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్.. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సభలో ఏం మాట్లాడుతారు అన్నదానిపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది.
Suicide : పెళ్లైన ఆరు నెలలకే ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య
విశాఖ ఉక్కు భావోద్వేగాలతో ముడిపడిన అంశమంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 9న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి పవన్‌కల్యాణ్ తీసుకెళ్లారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. 34మంది ప్రాణ త్యాగాలతో ఆ కర్మాగారం ఏర్పాటైందనే విషయాన్ని అమిత్‌షాకు వివరించారు. కానీ విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగానే అడుగులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ పర్యటన ఆసక్తి రేపుతోంది.
స్టీల్ ప్లాంట్ పోరాటానికి పవన్ మద్దతు తెలపటం పట్ల సీబీఐ మాజీ జేడీ.. లక్ష్మీ నారాయణ హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చుకునేలా ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.