Kambham Incident: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఈలోపే పెను ప్రమాదం.. పెళ్లి కూతురు కళ్ళముందే ఫ్యామిలీ మొత్తం..
శుక్రవారం ఉదయం పెళ్లి వేడుకకు వెళ్తుండగా కంభం (Kambham Incident)హైవేపై ఘోర విషాదం చోటుచేసుకుంది.
Horrific Accident occurred on Kambham Highway involving an auto heading to a wedding
- కంభం హైవేపై ఘోర ప్రమాదం
- పెళ్లి బంధువులు నలుగురు మృతి
- ఆసుపత్రిలో ఎనిమిది మందికి చికిత్స
Kambham Incident: ఆంధ్రప్రదేశ్‌లో ఒకే కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం పెళ్లి వేడుకకు వెళ్తుండగా కంభం(Kambham Incident) హైవేపై ఘోర విషాదం చోటుచేసుకుంది. గిద్దలూరు నల్లబండ బజార్‌కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు ఆటోలో వివాహ వేడుకకు బయలుదేరారు. దురదృష్టవశాత్తూ, వారు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఆవుల అలకనంద, అంకాలు, నగేష్, నాగేశ్వరిగా పోలీసులు గుర్తించారు. వీరంతా పెళ్లికూతురు కుటుంబానికి చెందినవారే కావడంతో ఆ ఇంట పెళ్లి బాజాల స్థానంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదంలో పెళ్లికూతురు వీరక్క స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడటం గమనార్హం.
మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని, అతివేగమే ప్రమాదానికి గల కారణమని ప్రాథమికంగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
