Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసు.. పేర్ని నానికి ఊరట లభిస్తుందా..!
రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి మచిలీపట్నం జిల్లా కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్న..

Perni Nani
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాము నుంచి రేషన్ బియ్యం మాయం అయిన ఘటనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధతోపాటు పేర్ని నాని, మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని సతీమణికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఇటీవల ఆమెను పోలీసులు స్టేషన్ కు పిలిపించి విచారించారు. ఈ కేసులో మరో నలుగురిని పోలీసుల అరెస్టు చేసి జైలుకు తరలించారు.
Also Read: Justin Trudeau: సొంత పార్టీలో అసమ్మతి.. రాజీనామాకు సిద్ధమైన కెనడా ప్రధాని ట్రూడో.. ప్రకటన ఎప్పుడంటే?
రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి మచిలీపట్నం జిల్లా కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్న నిందితుల్ని కస్టడీకి కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో నలుగురు నిందితులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన కోర్టులో విచారణ జరగనుంది.
Also Read: Tuna Fish: బాబోయ్.. ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు.. ఎక్కడో తెలుసా..? దాని ప్రత్యేకత ఏమిటంటే..
గోదాము నుంచి బియ్యం మాయం కేసులో పేర్ని నానిని ఇటీవల ఏ6గా పోలీసులు చేర్చారు. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ధర్మాసనం పోలీసులకు సూచించింది. ఈ క్రమంలో ఇవాళ మరోసారి హైకోర్టులో పేర్ని నాని ముందస్తు బెయిల్ పై విచారణ జరగనుంది. ఈ విచారణలో కోర్టు పేర్ని నానిని అరెస్టు చేయొద్దంటూ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా..? లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.