Perni Nani : అలిపిరిలో దాడి కావాలని చేయించుకున్నారా? మీకు కుక్క భాష వచ్చా? చంద్రబాబుకి పేర్నినాని కౌంటర్

Perni Nani : చంద్రబాబుకి ఎక్కడికక్కడ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నారు. ఆ స్లీపర్ సెల్స్ NIA, CBI లను కూడా మ్యానేజ్ చేస్తూ ఉంటారు.

Perni Nani : అలిపిరిలో దాడి కావాలని చేయించుకున్నారా? మీకు కుక్క భాష వచ్చా? చంద్రబాబుకి పేర్నినాని కౌంటర్

Perni Nani (Photo : Google)

Updated On : April 15, 2023 / 6:20 PM IST

Perni Nani : విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ పై దాడి కావాలని చేయించుకున్నదే అని అంటున్న చంద్రబాబుపై మాజీమంత్రి పేర్నినాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆరోపణలు, విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. జగన్ కావాలని ఆ దాడి చేయించుకుంటే.. మరి 2003లో అలిపిరిలో మీపై జరిగిన దాడి మీరు కావాలని చేయించుకున్నారా? అని చంద్రబాబుని ప్రశ్నించారు పేర్నినాని.

విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై హత్యాప్రయత్నం జరిగిందని పేర్నినాని స్పష్టం చేశారు. సంఘటన జరిగిన గంటలోనే వైసీపీ కార్యకర్త అని అప్పటి డీజీపీ చెప్పారని అన్నారు. ఎలాంటి దర్యాప్తు చెయ్యకుండానే డీజీపీ స్టేట్ మెంట్ ఇచ్చాడని గుర్తు చేశారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు.. కనీసం పరామర్శించకుండా కావాలని దాడి చేయించుకున్నారని జగన్ పై ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

Also Read..Minister Botsa Satyanarayana: ఎయిర్ పోర్టులో జగన్‌పై జరిగిన దాడి వాస్తవం.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు

హత్యాయత్నం జరిగింది, కానీ కుట్ర లేదని NIA చెప్పింది అని క్లారిటీ ఇచ్చారు పేర్నినాని. ఎన్ఐఏ ప్రభావితానికి గురికాకపోతే ఈ విధమైన చార్జిషీట్ ఎందుకు వస్తుంది..? అని ఆయన ప్రశ్నించారు. ఆకతాయితనంగా హత్యాప్రయత్నం జరిగిందని కేసు క్లోజ్ చెయ్యాలని చూస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా మ్యానేజ్ చేయబడుతున్నాయని పేర్నినాని ఆరోపించారు. నిష్పక్షపాతంగా విచారణ చెయ్యాల్సిన అధికారులు దిగజారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.(Perni Nani)

” జగన్ పై హత్యహత్యం కేసు అనకుండా కోడి కత్తి కేసు అనడం ఏంటి..? జగన్ కు సానుభూతి కోసం దాడి చేశానని శ్రీనివాస్ చెప్పాడంటున్నారు. శ్రీనివాస్ జైల్లో ఉంటే వాళ్లకి స్టేట్ మెంట్ ఎలా ఇచ్చారు? జైల్లో నుండి ఫోన్ చేశాడా..? జగన్ కావాలని చేయించుకుంటే.. 2003 అలిపిరిలో చంద్రబాబుపై దాడి కావాలని చేయించుకున్నారా..?

Also Read..Chandrababu : జగన్ ఉన్నంత వరకు రాష్ట్రం అభివృద్ధి చెందదు : చంద్రబాబు

జగన్ పై జరిగిన హత్యాప్రయత్నం వెనుక ఎవరున్నారో తెలియాలని ఫిర్యాదు చేశాం. ఎయిర్ పోర్టులోకి కత్తి ఎలా వచ్చిందో విచారణ చేయాలని కోరాం. నేర చరిత్ర ఉన్న వ్యక్తికి ఎయిర్ పోర్టు లో ఉద్యోగానికి ఎలా అనుమతిస్తారు..? వైసీపీ కార్యకర్త అయితే టీడీపీ నేత హర్షవర్ధన్ ఎందుకు ఉద్యోగంలో పెట్టుకున్నాడు? గరుడ పురాణం అని శివాజీతో స్టోరీ చెప్పించి.. హర్షవర్ధన్ తో శ్రీనివాస్ కు ఉద్యోగం ఇచ్చారు.

CC కెమెరాలు పని చెయ్యడం లేదని పోలీసులు చెప్పారు. ఎన్ఐఏ ఏమో.. కుట్ర జరగలేదని సీసీ కెమెరాలు చెబుతున్నాయంది. ఇదేం విచారణ? శ్రీనివాస్ ను టీడీపీ నేతలు ఏదో చేయబోతున్నారని మాకు అనుమానంగా ఉంది. టీడీపీ సానుభూతిపరులు తరుచూ రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి కలిసి వస్తున్నారు. ఇటీవలే ఓ మహిళా టీడీపీ సానుభూతిపరురాలైన లాయర్ వెళ్లి కలిసి వచ్చింది.(Perni Nani)

Also Read..DL Ravindra Reddy : జగన్ నుంచి విజయమ్మ, షర్మిలకు ముప్పు.. వారు జాగ్రత్తగా ఉండాలి: మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుకి ఎక్కడికక్కడ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నారు. ఆ స్లీపర్ సెల్స్ NIA, CBI లను మ్యానేజ్ చేస్తూ ఉంటారు. డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి స్లీపర్ సెల్స్ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు. విజయమ్మ, షర్మిల, భారతీల గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వైఎస్సార్ దగ్గర బతికిన రవీంద్రారెడ్డి.. వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం గురించి నీచంగా మాట్లాడారు.(Perni Nani)

డీఎల్ రవీంద్రారెడ్డి నీచమైన వ్యక్తి. చంద్రబాబుని ఔరంగ జేబు అని మేము అనడం కాదు NTR అన్నారు. జగన్ ను తుగ్లక్ అంటున్నారు.. తుగ్లక్ కూడా ముస్లీం రాజు కదా. చంద్రబాబుకి కుక్క భాష వచ్చా? కుక్క ఆయనకి చెప్పిందా జగన్ పాలన నచ్చలేదని? రాష్ట్రంలో పచ్చ కుక్కలు రాజకీయాల కోసం నిజమైన కుక్కలను కూడా వాడుకుంటున్నాయి” అని ఫైర్ అయ్యారు పేర్నినాని.