Perni Nani: అందుకే పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభ పెడుతున్నారు: పేర్ని నాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ ను తిట్టేందుకే ఇవాళ జనసేన ఆవిర్భావ సభ పెడుతున్నారని అన్నారు. ఇవాళ పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభకు ఎటువంటి ఎజెండా లేదని చెప్పారు. చంద్రబాబుని ఎవరైనా విమర్శిస్తే వాళ్లను విమర్శించడానికే పవన్ సభ పెడతారని అన్నారు.

Perni Nani
Perni Nani: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ ను తిట్టేందుకే ఇవాళ జనసేన ఆవిర్భావ సభ పెడుతున్నారని అన్నారు. ఇవాళ పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభకు ఎటువంటి ఎజెండా లేదని చెప్పారు. చంద్రబాబుని ఎవరైనా విమర్శిస్తే వాళ్లను విమర్శించడానికే పవన్ సభ పెడతారని అన్నారు.
చంద్రబాబు నాయుడి ఆప్తులకు ఆపద వస్తేనే పవన్ కల్యాణ్ నోరు విప్పుతారని పేర్ని నాని చెప్పారు. ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్ కార్యాచరణపై లక్ష్యం ఉండాలని అన్నారు. చంద్రబాబు నాయుడికి సేవ చేసేందుకు పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీని స్థాపించారని ఆరోపించారు.
కాపులను చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారని ఆరోపించారు. కాగా, నేడు జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ వేడుకలు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరగనున్నాయి. అక్కడకు పవన్ కల్యాణ్ “వారాహి”లో చేరుకుంటారు.
Exam Center Locator App : ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్.. ఎగ్జామ్ సెంటర్ కు ఈజీగా వెళ్లొచ్చు!