క్వారంటైన్ లో దెయ్యం ఉందంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

  • Published By: bheemraj ,Published On : June 4, 2020 / 07:55 PM IST
క్వారంటైన్ లో దెయ్యం ఉందంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Updated On : June 4, 2020 / 7:55 PM IST

కర్నూలు జిల్లాలోని ఓ క్వారంటైన్ సెంటర్ లో దెయ్యం భయం కలకలం రేపింది. జిల్లాలోని కోసిగి క్వారంటైన్ లో ఉన్న ఓ వ్యక్తి..దెయ్యం ఉందంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చుట్టూ తిరుగుతుందనే అనుమానంతో బాబు అనే వ్యక్తి భయపడుతున్నాడు. ఆ భయం కాస్త తీవ్రస్థాయికి చేరడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు.  ఇది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. దెయ్యం ఉందంటూ కొన్ని రోజులుగా బాబు క్వారంటైన్ లో గొడవ చేస్తున్నాడు.

కోసిగిలోని ఆదర్శ పాఠశాల వసతి గృహంలో ఏర్పాటు చేపిన క్వారంటైన్ సెంటర్ లో బాబు అనే వ్యక్తి దెయ్యం ఉందని భయభ్రాంతులకు గురయ్యాడు. ఇక్కడ దెయ్యం ఉంది..మనం ఇంటికి వెళ్లిపోవాలని భార్యతో ఘర్షణ చోటుచేసున్నట్లు సమాచారం. వీరు ముంబాయి నుంచి వలస వచ్చి కూలీలు క్వారంటైన్ కు తరలించిన సందర్బంగా కోసిగి మండలంల ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో భార్యాభర్తలిద్దరూ అక్కడే ఉన్నారు. ఆ సందర్భంలోనే ఇక్కడ బూత్ బంగ్లాగా ఉంది. ఇక్కడ దెయ్యం ఉంది. నేను ఇంటికి వెళ్లాలని భార్యతో గొడవ పడినట్లు సమాచారం. 

క్వారంటైన్ లో ఉన్న కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అక్కడే ఉన్న స్థానికులు స్పందించి అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు వైద్యం అందిస్తున్న క్రమంలో క్షేమంగా ఉన్నట్లు సమాచారం. అక్కడున్న అధికారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది.