ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిది. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం తగదని స్పీకర్ కామెంట్ చేశారు. కోర్టులు ప్రభుత్వాన్ని నడిపిస్తాయా అని ప్రశ్నించారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు కేసు వేశాడు. స్పీకర్ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని పిటిషన్ లో ప్రస్తావించారు. న్యాయవ్యస్థపై విశ్వాసం సన్నగిల్లేలా స్పీకర్ వ్యాఖ్యలు ఉన్నాయని పిటిషన్ వేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల తిరుపతిలో న్యాయవ్యవస్థపై చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రమేష్ నాయుడు హైకోర్టులో పిటిషన్ వేశారు.
పాలనా పరమైన వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకునేటప్పుడు చట్ట సభలు ఎందుకు అని చేసిన ఆరోపణలు ఎవైతే ఉన్నాయో వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని రమేష్ నాయుడు అన్నారు. న్యాయ వ్యవస్థను ధిక్కరించి, అప్రతిష్టపాల్జేసి అవమానించడమే అని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి నిర్ణయాన్ని హైకోర్టు తీసుకోవాల్సివుంది. దీనిపై ఆన్ లైన్ లో విచారణ జరిగే అవకాశం ఉంది.