Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు అరెస్ట్..

అరెస్ట్ భయంతో కొందరు ఊరు వదిలి వెళ్లిపోయారని తెలుస్తోంది. వాళ్లు తిరిగి ఎప్పుడు ఊరిలోకి వస్తారోనని పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.

Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు అరెస్ట్..

Updated On : December 6, 2024 / 4:36 PM IST

Vallabhaneni Vamsi Mohan : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే వంశీ అనుచరుల ఇళ్ల దగ్గర కాపు కాసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు వంశీకి అనుచరులుగా ఉన్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

గవన్నరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాఫ్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 74 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. తాజాగా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీ అనుచరులు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వారిని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాడికి గల కారణాలు ఏంటి? దాడి చేయడమని ఎవరు చెప్పారు? ఎందుకు దాడి చేశారు? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీతో పాటు మరికొందరు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అనుచరులపై పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో అరెస్ట్ భయంతో కొందరు ఊరు వదిలి వెళ్లిపోయారని తెలుస్తోంది. వాళ్లు తిరిగి ఎప్పుడు ఊరిలోకి వస్తారోనని పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. వారు ఊరిలోకి వచ్చిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున 11మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ ప్రభుత్వం వచ్చాక పార్టీ ఆఫీస్ పై దాడి కేసుని సీరియస్ గా తీసుకుంది. దాడికి పాల్పడ్డ వారిని వదిలేది లేదని టీడీపీ నేతలు తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో 74మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 85 మందిని అరెస్ట్ చేయగా.. మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి చాలా పెద్ద తప్పు చేశారని, దీని వెనుక ఎవరున్నా, ఎంతటి వారైనా వదిలేది లేదని మంత్రి నారా లోకేశ్ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని లోకేశ్ చెప్పారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి.

 

Also Read : అధికారం పోయిన 6 నెలల్లోనే.. చంద్రబాబు స్ట్రాటజీనే జగన్ ఫాలో కాబోతున్నారా?