Gossip Garage : అధికారం పోయిన 6 నెలల్లోనే.. చంద్రబాబు స్ట్రాటజీనే జగన్ ఫాలో కాబోతున్నారా?

ఇలా ఎన్నికలు అయిపోయి ఆరు నెలల కాకముందే అధికార కూటమి, అపోజిషన్ వైసీపీ పొలిటికల్ ఫైట్ స్టార్ట్ చేశాయి.

Gossip Garage : అధికారం పోయిన 6 నెలల్లోనే.. చంద్రబాబు స్ట్రాటజీనే జగన్ ఫాలో కాబోతున్నారా?

Gossip Garage Chandrababu Vs Jagan (Photo Credit : Google)

Updated On : December 5, 2024 / 11:34 PM IST

Gossip Garage : జస్ట్‌ సిక్స్ మంథ్స్‌. ఏపీలో ఎన్నికలు అయిపోయి..ఆరు అంటే ఆరు నెలలు కూడా అయిపోలేదు. కానీ అప్పుడే రాబోయే ఎన్నికల మీద ఫోకస్ పెట్టాయి పార్టీలు. ఆందోళనలకు, జిల్లాల పర్యటనలకు ప్రతిపక్ష నేత రెడీ అవుతుంటే..జగన్‌ కంటే ముందే జనంలోకి వెళ్లేందుకు కూటమి ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ పథకాలపై ప్రచారంతో పాటు.. ఊరారా..ఇంటింటికి వెళ్లాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అపోజిషన్ కాన్సంట్రేషన్ చేసిన ఇష్యూస్‌ సాల్వ్‌ చేసి..ప్రతిపక్షానికి ఎజెండానే లేకుండా ప్లాన్ చేస్తున్నారట. నవ్యాంధ్ర పొలిటికల్ ఫైట్‌లో ఎవరి ప్లాన్‌ ఏంటి.? కూటమి వ్యూహం ఏంటి.? జగన్‌ స్కెచ్‌ ఏంటి.?

జ‌గ‌న్ క‌న్నా ముందే..ప్రజ‌ల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచన..
రాజకీయం..నిత్య పోరాటం. ప్రతీది ఇంపార్టెంటె. చిన్న ఇష్యూను కూడా వదలడానికి ఇష్టపడవు పార్టీలు. వ్యూహం..ప్రతి వ్యూహం ఉంటేనే పొలిటికల్ సమరం హీటెక్కుతుంది. ఏపీలో ఇప్పుడిదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది కూటమి. డిసెంబర్‌ చివరి నుంచి ప్రజా సమస్యలపై పోరుతో పాటు..జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు మాజీ సీఎం జగన్‌. ఓ వైపు క్యాడర్‌కు ధైర్యం కల్పించడంతో పాటు మరోవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూ నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే జగన్‌ ఎత్తులకు..కూటమి ప్రతి వ్యూహాలు రచిస్తోందట. జ‌గ‌న్ క‌న్నా ముందే..ప్రజ‌ల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లడంతో పాటు..రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు..గత సర్కార్ చేసిన తప్పిదాలను వివరించాలని చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారట.

చంద్రబాబు స్ట్రాటజీని ఫాలో కానున్న జగన్..!
ఈ క్రమంలోనే మంత్రులను, ఎమ్మెల్యేలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రజ‌ల మ‌ధ్య ఉండాల‌ని చెబుతున్నారు. ప్రతిప‌క్ష నాయ‌కుడు ప్రజ‌ల్లోకి వ‌స్తే.. ప్రభుత్వం మీద విమర్శలు స్టార్ట్‌ అయ్యే అవకాశం ఉంటుందని ముందే అలర్ట్ అవుతున్నారు. ప్రజ‌లు మ‌రిచిపోయిన అంశాల‌ను గుర్తుకు తేవడంతో పాటు సంబంధం లేని అంశాలను మెడకు చుట్టే అవకాశం ఉంటుందని ప్రతివ్యూహాలు సిద్దం చేస్తున్నారట. గ‌తంలో చంద్రబాబు కూడా..ప్రతిప‌క్ష నాయ‌కుడిగా ప్రజ‌ల మ‌ధ్యకు వ‌చ్చాకే.. జ‌గ‌న్ స‌ర్కారుకు ఇసుక వేడి త‌గిలింది. మ‌ద్యం ప‌రిస్థితి తెలిసింది. జగన్‌ పాలనలో మూడో ఏడాది నుంచే ప్రజా వ్యతిరేక‌త‌ను పెంచ‌డంలో చంద్రబాబు స‌క్సెస్ కావ‌డానికి కారణం పబ్లిక్‌లో ఉండటమే. మాజీ సీఎం జ‌గ‌న్ ఇప్పుడు ఇదే స్ట్రాటజీని..అధికారం పోయిన ఆరు నెలల్లోనే ఫాలో కాబోతున్నారు.

ఒక్కసారి వ్యతిరేక‌త అంటూ మొద‌లైతే.. దానిని కంట్రోల్ చేయడం కష్టం…
జ‌గ‌న్ పబ్లిక్‌లోకి వెళ్తే సూప‌ర్ సిక్స్‌పై ప్రస్తావించడం ఖాయం. అదే స‌మ‌యంలో ప‌న్నులు, విద్యుత్ చార్జీల భారం వంటి వాటిని కూడా ఆయ‌న లేవ‌నెత్తే అవకాశం ఉంటుంది. ఒక‌ర‌కంగా కూట‌మి సర్కార్ ఎన్ని చేసినా..ఒక్కసారి వ్యతిరేక‌త అంటూ మొద‌లైతే..దానిని కంట్రోల్ చేయడం కష్టం. అందుకే జ‌గ‌న్ కంటే ముందుగానే ప్రభుత్వం ప్రజ‌ల్లోకి వెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన. ప్రజ‌ల మ‌ధ్యకు వెళ్లి..ఏం చేస్తున్నామో చెప్పడం ద్వారా..జ‌గ‌న్ చేసే ప్రచారానికి ముందే..తమ ప్రొగ్రెస్‌ను ప్రజ‌ల‌కు వివ‌రించినట్లు అవుతుందని చూస్తున్నారట. ఈ విష‌యంపై ఇప్పటికే నాయ‌కుల‌కు స‌మాచారం కూడా ఇచ్చారట.

విమర్శకు ప్రతి విమర్శతో అక్కడే సరిపెట్టొచ్చన్న భావన..
జగన్‌ మాత్రమే జనాల్లో ఉండి..ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఆయన సెంట్రిక్‌గానే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అపోజిషన్‌తో పాటు పవర్‌లో ఉన్న తాము కూడా పబ్లిక్‌లోనే ఉంటే విమర్శకు ప్రతి విమర్శతో అక్కడే సరిపెట్టొచ్చని భావిస్తున్నారు బాబు. మీడియా కవరేజ్‌ కూడా వన్‌ సైడ్ ఉండకుండా ప్రభుత్వం తరఫున యాక్టివిటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో అభివృద్ది పనులు, ప్రారంభోత్సవాల కోసం అప్పుడప్పుడు జిల్లాలకు వెళ్లే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ప్రొగ్రామ్స్‌కు కూడా ప్లానింగ్‌ జరుగుతుందని అంటున్నారు.

లెక్క ప్రకారం ఇంకో నాలుగున్నరేళ్లకు ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ జమిలి వస్తే రెండేళ్లు ముందుగా ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదే ఆలోచనతో జగన్‌ ఇప్పటినుంచే సమరం స్టార్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్ష నేత కదలికలను గమనించి అలర్ట్ అయిన కూటమి..ఎన్నికలు ఎప్పుడొస్తాయన్నది లెక్క కాదు..ప్రజల్లో ఉండటం ఇంపార్టెంట్‌ అని భావిస్తోందట. ఇప్పటి నుంచే ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయితే కంట్రోల్ చేయడం కష్టమని..జగన్‌ వ్యూహాలకు విరుగుడుగా ఆయుధాలు సిద్దం చేసి పెట్టుకుంటుందట. గత సర్కార్ హయాంలోని అక్రమాలను ఎక్స్‌ పోజ్‌ చేయడంతో పాటు వైసీపీ హయాంలో చేసిన అప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇలా ఎన్నికలు అయిపోయి ఆరు నెలల కాకముందే అధికార కూటమి, అపోజిషన్ వైసీపీ పొలిటికల్ ఫైట్ స్టార్ట్ చేశాయి. చూడాలి మరి ఈ ఎత్తుకు పైఎత్తుల్లో రాజకీయాల్లో ఎవరు పైచేయి సాధిస్తారనేది.

 

Also Read : మంత్రులు ఎమ్మెల్యేలకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏంటి? ఈ కొత్త ట్రెండ్ చంద్రబాబు ఎందుకు స్టార్ట్ చేసినట్లు?