Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. జనసైనికులపై లాఠీఛార్జ్

అనుమంచిపల్లి దగ్గర మరోసారి పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. జనసైనికులపై లాఠీఛార్జ్

Police Stopped Pawan Kalyan

Police Stopped Pawan Kalyan : విజయవాడ-హైదరాబాద్ హైవేపై హైటెన్షన్ నెలకొంది. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెకోపోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ వాటిని జనసైనికులు తొలగించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.

ఈ ఘటనతో విజయవాడ-హైదరాబాద్ పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుమంచిపల్లి దగ్గర మరోసారి పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు గరికపాడు దగ్గర పవన్ కళ్యాణ్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

Chandrababu : సిట్ కార్యాలయంలో చంద్రబాబుతో మాట్లాడిన లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మిణి, బాలకృష్ణ

పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద పడుకుని జనసేనాని నిరసన తెలియజేస్తున్నారు. హైదరాబాద్ -విజయవాడ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. పవన్ కళ్యాణ్ ను గన్నవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు కలిశారు.

వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అనుంచిపల్లి వద్దకు అదనపు బలగాలను పోలీసులు తీసుకొస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చాక మంగళగిరికి పంపించే అంశంపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.