Chandrababu : సిట్ కార్యాలయంలో చంద్రబాబుతో మాట్లాడిన లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ

అందరి సహకారంతో కుట్ర రాజకీయాలను ధీటుగానే ఎదుర్కొంటానని కుటుంబ సభ్యులకు చంద్రబాబు చెప్పారు. కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Chandrababu : సిట్ కార్యాలయంలో చంద్రబాబుతో మాట్లాడిన లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ

Chandrababu SIT office

Chandrababu In SIT Office : సిట్ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. సిట్ కార్యాలయంలో 2గంటలు వేచి ఉన్న తర్వాత చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులకు సీఐడీ అనుమతి ఇచ్చింది. చంద్రబాబును లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ కలిసి మాట్లాడారు. తన వైపు ధర్మం ఉందని.. ఎవరికి, ఎలాంటి ఆందోళన వద్దని కుటుంబ సభ్యులతో చంద్రబాబు అన్నారు.

అందరి సహకారంతో కుట్ర రాజకీయాలను ధీటుగానే ఎదుర్కొంటానని కుటుంబ సభ్యులకు చంద్రబాబు చెప్పారు. కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబును కలిసిన అనంతరం కుటుంబ సభ్యులు సిట్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.

Pathuri Nagabhushanam : చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు : పాతూరి నాగభూషణం

చంద్రబాబును సీఐడీ అధికారులు రాత్రంతా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన 24గంటలు ముగిసేలోపు అంటే రేపు (ఆదివారం) ఉదయం 5గంటలకు జడ్జి ఎదుట చంద్రబాబును హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమచారం.

సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు పంపించి వేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.