చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు : రైతులకు వార్నింగ్

అమరావతి ప్రాంతంలో ఆందోళనకారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలకు ఎలాంటి

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 06:03 AM IST
చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు : రైతులకు వార్నింగ్

Updated On : January 6, 2020 / 6:03 AM IST

అమరావతి ప్రాంతంలో ఆందోళనకారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలకు ఎలాంటి

అమరావతి ప్రాంతంలో ఆందోళనకారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. రాజధాని అమరావతి గ్రామాల్లో ధర్నాలకు, పాదయాత్రలకు ఎలాంటి అనుమతులు లేవని అడిషనల్ ఎస్పీ చక్రవర్తి స్పష్టం చేశారు. ప్రజలు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. కేవలం మీడియా వారిపై దాడి చేసిన వారికే పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పారు. ధర్నాలు, నిరసనలు చేస్తున్న వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ప్రతి రోజు రోడ్డుపై ధర్నాలు చేస్తున్నారని అన్నారు. నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, కానీ ఎదుటి వారిని ఇబ్బంది కలిగించకూడదన్నారు.

మందడంలో పోలీసులకు సహాయ నిరాకరణ అవాస్తవం అని అన్నారు. పోలీసులు ఎవరి మీదా ఆధారపడి పని చేయడం లేదన్నారు. పోలీసులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు(నీళ్లు, టిఫిన్) డిపార్ట్ మెంట్ కల్పిస్తుందని చక్రవర్తి చెప్పారు. మందడంలో జరిగిన ఘటనలో మహిళా రైతులు పోలీసులను రెచ్చగొట్టారని చక్రవర్తి ఆరోపించారు. మహిళలు కానిస్టేబుల్‌పై దాడి చేసి గాయపరిచిన ఫోటోలను ఆయన మీడియాకి చూపించారు. మందడం మహిళలకే కాదు తమ మహిళా పోలీసులకు కూడా గాయాలయ్యాయన్నారు. రైతులు శాంతియుతంగా ఉన్నంత కాలం ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమే అని ఏఎస్పీ తెలిపారు.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని గ్రామాల రైతులు చేపట్టిన పోరాటం 20వ రోజుకి చేరింది. మందడం, తుళ్లూరులో రైతులు మహా ధర్నాకు దిగారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు నుంచి వెలగపూడి మీదుగా మందడం వరకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్దండరాయుని పాలెంలో నిరసన తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో రాజకీయ పక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. రాజధానిని తరలించొద్దని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : దాడి చేశారు : పోలీసులకు ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు