Cm Revanth Reddy: గల్లీ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం? బీఆర్ఎస్కు ఓటు అడిగే అర్హత లేదు- సీఎం రేవంత్
కేంద్రంలోని బీజేపీకి అన్ని విషయాల్లో బీఆర్ఎస్ సహకరించింది. నరేంద్ర మోదీ తెచ్చిన ప్రతీ చట్టానికి మద్దతిచ్చారు.
Cm Revanth Reddy Representative Image (Image Credit To Original Source)
- బీజేపీ వాళ్ల లైఫ్ లైనే అసదుద్దీన్ ఒవైసీ
- మున్సిపాలిటీలలో సమస్యలకు బీఆర్ఎస్ వాళ్లే కారణం
- ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్, బీజేపీకి లేదు
Cm Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గల్లీ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం అని ప్రశ్నించారాయన. మున్సిపల్ ఎన్నికల్లో మోదీని చూసి ఓటు వేస్తే.. మోరిని తీయడానికి మోదీ వస్తారా? అని సీఎం రేవంత్ నిలదీశారు. బీజేపీ వాళ్లు రాముడి పేరు చెబుతారు కానీ రోజూ దండం పెట్టుకునేది అసద్దుదీన్ ఒవైసీకే అని విమర్శించారు. బీజేపీ వాళ్ల లైఫ్ లైనే అసదుద్దీన్ ఒవైసీ అని సెటైర్ వేశారు. ఒవైసీ పేరు లేకుండా, జపం చేయకుండా ఉండలేరని అన్నారు. రాముడి పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో, ఒవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో ప్రజలే చూడాలన్నారు. ప్రతీసారి అసదుద్దీన్ ఒవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకుని బీజేపీ వాళ్లు ఓట్లు అడుగుతారు అని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. 12ఏళ్లుగా అధికారంలో ఉన్నారు, మరి అసద్ ను ఏం చేశారు? ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. ఇంకా ఎంతకాలం మత విద్వేషాలతో కాలం గడుపుతారు అని ధ్వజమెత్తారు.
గత పదేళ్లుగా సర్పంచ్ నుంచి మొదలుకొని పార్లమెంట్ వరకు బీఆర్ఎస్ వాళ్లే ఉన్నారన్న రేవంత్.. మున్సిపాలిటీలలో సమస్యలకు మీరే కారణం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో బెదిరించి అందరినీ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు అడిగే అర్హతే లేదన్నారు.
”గత పదేళ్లు అధికారంలో ఉండి రూ.20 లక్షల కోట్లు ఇస్తే చేసిందేంటి..? బీఆర్ఎస్ లో ఒక్కరో ఇద్దరో గెలిచినా మున్సిపాలిటీలకు వస్తారా..? కేసీఆర్ ఎలానో వాళ్లూ అంతే. అహకారంతో స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు. మా ఈగల్ టీమ్ కు చెప్పాల్సి వస్తుంది. బరితెగించి మాట్లాడుతున్నారు. కేంద్రంలోని బీజేపీకి 2022 వరకు అన్ని విషయాల్లో బీఆర్ఎస్ సహకరించింది. నరేంద్ర మోదీ తెచ్చిన ప్రతీ చట్టానికి మద్దతిచ్చారు. కాళేశ్వరం విషయంలో సీబీఐకి ఇస్తే.. 48 గంటల్లో అరెస్ట్ చేస్తామన్నారు. ఏమైంది..? ఫార్ములా కేసులో కేటీఆర్ ను ఈడీ ఎందుకు విచారణ చేయడం లేదు?
బీఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలి. ఈరోజు ఉన్న సమస్యలన్నిటికీ కారణం బీఆర్ఎస్ వాళ్లే. మేము రెండేళ్లుగా.. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఒకటవ తేదీనే జీతాలు ఇస్తున్నాం. ఆరోగ్య శ్రీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రేషన్ కార్డులు, సన్న బియ్యం, రూ.500లకు సిలిండర్, వ్యవసాయానికి 1.15 లక్షల కోట్లు ఖర్చు చేశాం, రుణమాఫీ చేశాం” అని సీఎం రేవంత్ అన్నారు.
Also Read: ఆ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: హరీశ్ రావు
