JanaSena: తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చేందుకు మేము సిద్ధం: జనసేన సవాల్
దమ్ముంటే తమ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.

Pothina venkata mahesh-YS Jagan
ఏపీలో ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడిందంటూ ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాయడంపై రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. దీంతో మంత్రులకు జనసేన దీటుగా కౌంటర్లు ఇస్తోంది. మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత పోతిన వెంకట మహేశ్ స్పందించారు.
విజయవాడలో పోతిన వెంకట మహేశ్ మాట్లాడుతూ… మోదీకి పవన్ కల్యాణ్ రాసిన లేఖతో సీఎం వైఎస్ జగన్‌కు, మంత్రి జోగి రమేశ్‌కు వణుకు మొదలైందని అన్నారు. అందుకే వారు ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. జోగి రమేశ్ బహిరంగ చర్చకు రావాలన్నారని, తాము సిద్ధంగా ఉన్నామని పోతిన మహేశ్ అన్నారు.
జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పోతిన మహేశ్ చెప్పారు. సీఎం జగన్, మంత్రులు వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. దోపిడీకి కొత్త పాలసీనే ఇళ్ల నిర్మాణమని చెప్పారు. చర్చించడానికి దమ్ముంటే తమ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.
పవన్ కల్యాణ్ చెప్పింది పూర్తిగా నిజం అని, కాదని నిరూపించే దమ్ముందా? అని అడిగారు. మంత్రి జోగి రమేశ్ మరోసారి పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్‌పై కేసులు ఉన్నాయని, ఇప్పటికే జైలుకు కూడా వెళ్లి వచ్చారని అన్నారు. ప్రజలు జగన్‌కు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.