తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే దేశంలో ఎన్నో మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని తెలిపారు.

తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు

Prakash Raj

Updated On : September 20, 2024 / 7:17 PM IST

Prakash Raj: తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారన్న అంశంపై దేశ వ్యాప్తంగా కలకలం చెలరేగుతున్న వేశ దీనిపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పేరును ప్రస్తావిస్తూ ఆయన ఓ సూచన చేశారు.

పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగిందని, దయచేసి దీనిపై విచారణ జరపాలని అన్నారు. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేగానీ, దీనిపై ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారని, ఈ సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారని అన్నారు.

ఇప్పటికే దేశంలో ఎన్నో మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని తెలిపారు. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ ఎక్స్ లో ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేశారు. కాగా, శ్రీవారి లడ్డూ వివాదంపై ఇప్పటికే స్పందించిన పవన్ కల్యాణ్ తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని చెప్పిన విషయం తెలిసిందే. ల్యాబ్‌ పరీక్షలు చేయాలని కోరారని, లడ్డూ గురించి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ టీటీడీ గత ఛైర్మన్‌తో పాటు ఈవో పట్టించుకోలేదని తెలిపారు.

తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు