Visakhapatnam : ప్రేమోన్మాది హర్షవర్ధన్ మృతి

విశాఖలో యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించి ఆ తర్వాత తాను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమోన్మాది హర్షవర్ధన్ మృతి చెందాడు.

Visakhapatnam : ప్రేమోన్మాది హర్షవర్ధన్ మృతి

Visakhapatnam

Updated On : November 16, 2021 / 9:49 AM IST

Visakhapatnam :  విశాఖలో యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించి ఆ తర్వాత తాను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమోన్మాది హర్షవర్ధన్ మృతి చెందాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు హర్షవర్ధన్.. కాగా తనను ప్రేమించడం లేదన్న కోపంతో గత శనివారం యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించిన హర్షవర్ధన్.. అనంతరం తాను కూడా పెట్రోల్ పోసుకొని నిప్పుపెట్టుకున్నాడు.

చంద్రబాబు : Girl Eloping With Lover : దారుణం : ప్రేమికుడితో పారిపోయిందని గుండు కొట్టించి మసిపూశారు

ఈ ఘటనలో హర్షవర్ధన్ కి 62 శాతం గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. మూడు రోజులుగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న హర్షవర్ధన్ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మరణించాడు. కాగా ఇప్పటికే హర్షవర్ధన్‌‌పై 307, 309, 356ఏ, 354డీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

చంద్రబాబు : Love Trap : స్నేహం పేరుతో బాలికకు దగ్గరయ్యాడు.. ఆ తర్వాత