ఏపీలో క్వారంటైన్ ఏర్పాట్లు సూపర్బ్..మెచ్చుకున్న బ్రిటన్ ప్రోఫెసర్

  • Published By: madhu ,Published On : April 18, 2020 / 07:04 AM IST
ఏపీలో క్వారంటైన్ ఏర్పాట్లు సూపర్బ్..మెచ్చుకున్న బ్రిటన్ ప్రోఫెసర్

Updated On : April 18, 2020 / 7:04 AM IST

కరోనా వైరస్ వ్యాపించకుండా..కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటన్ ప్రోఫెసర్ మెచ్చుకున్నారు. విదేశాల్లో కూడా ఇలాంటి సౌకర్యాలు చూడలేదని, స్టార్ హోటల్స్ లను తలపించేలా ఉన్నాయని కితాబిచ్చారు. అసలు ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఆమెకెలా తెలిసింది ? ప్రభుత్వాన్ని మెచ్చుకోనడానికి గల కారణాలేంటీ ? అనేగా మీ సందేహం.

ఎందుకంటే కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో ఆమె ఏపీలోని తిరుపతిలో ఉన్నారు. ఇంకేముంది కరోనా ఆమెకు సోకింది. వెంటనే అధికారులు క్వారంటైన్ కు తరలించారు. కొన్ని రోజులు కేంద్రంలో చికిత్స తీసుకుని ఆరోగ్యవంతురాలిగా బ్రిటన్ కు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆమె అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తిరుపతి శ్రీ వారి దర్శనం కోసం బ్రిటన్ ప్రోఫెసర్ క్లైవ్ కుల్లీ వచ్చారు. కానీ కరోనా వైరస్ సోకడంతో తిరుచానూరులోని శ్రీ పద్మావతి ఆలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 22 రోజుల పాటు చికిత్స అందించారు. 2020, ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. 

తాను ఊహించిన దానికన్నా..బెస్ట్ ఏర్పాట్లు చేశారు. స్టార్ హోటల్స్ తలపించేలా క్వారంటైన్ లో వసతి సౌకర్యాలున్నాయని చెప్పారు. వైద్యులు, సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారని ప్రశంసించారు. హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. మరోసారి భారత్‌కు వచ్చినప్పుడు వారిని తప్పకుండా కలుస్తానని తెలిపారామె. రోజుకు రెండుసార్లు స్నాక్స్, బిస్కెట్లు ఇచ్చారని, వైద్యులు సూచించిన పౌష్టికాహారాన్ని గది వద్దే అందించారన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బ్రిటన్ వెళ్లేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు.