Visakha railway zone : విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉంది : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు.

Visakha railway zone : విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉంది : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

Visakha railway zone :

Updated On : September 28, 2022 / 4:19 PM IST

Visakha railway zone :  ఏపీ, తెలంగాణ విభజన హామీలు..సమస్యల అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఏపీ విభజన హామీల్లో భాగంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అటువంటి వార్తల్ని నమ్మవద్దని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఈ అంశంపై వచ్చిన వదంతులను ఏమాత్రం నమ్మవద్దని స్పష్టంచేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే భూ సేకరణ పూర్తి అయిందని వెల్లడించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారంగా చూస్తే ఇక త్వరలోనే విశాఖ రైల్వే జోన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ విషయంపై బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ..విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర మంత్రి త్వరలో ప్రారంభిస్తారని.. రైల్వే జోన్ వియషంలో ఎటువంటి వివాదాలు లేవని తెలిపారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపిందని..ఈ విషయంపై వచ్చే వదంతులను ఏమాత్రం నమ్మవద్దని తెలిపారు.