Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మారనున్న వాతావరణం.. మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం(Rain Alert) పూర్తిగా మారనుంది.
Rain alert in telangana and andhra pradesh
- రెండు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు
- తీరప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత
- రాత్రి వేళల్లో చల్లబడనున్న వాతావరణం
Rain Alert: రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారనుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా కొన్ని జిల్లాల్లో అడపాదడపా జల్లులు పడతాయి. అయితే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Badradri: బ్రతుకుండగానే చంపేశారు.. భూమి కాజేశారు.. భద్రాద్రి కొత్తగూడెంలో ఘోరం
మరోవైపు తెలంగాణలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు కొన్ని జిల్లాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు (Rain Alert)పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 28°C నుండి 31°C వరకు నమోదవుతుండగా, రాత్రి వేళల్లో 23°C వరకు చల్లబడే అవకాశం ఉంది. అక్కడక్కడా ఎండ తీవ్రత కూడా కాస్త ఎక్కువగా ఉంటూనే, అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి వర్షాలు పడే విచిత్ర పరిస్థితులు రానున్న మూడు రోజుల్లో కనిపిస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
