Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. నేడు, రేపు ఏపీలో వర్షాలు

నేడు, రేపు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతూ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని చెప్పారు. అది నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రేపు, ఎల్లుండి అది తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరాల వైపునకు పయనిస్తుందని చెప్పారు.

Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. నేడు, రేపు ఏపీలో వర్షాలు

Updated On : November 20, 2022 / 12:18 PM IST

Rains In Andhra Pradesh: నేడు, రేపు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతూ పశ్చిమ వాయవ్య దిశగా కదిలి, అది నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని నేడు వాయుగుండంగా మారిందని తెలిపారు. ప్రస్తుతానికి జాఫ్నా (శ్రీలంక)కి తూర్పున 600 కి.మీ, తూర్పు ఆగ్నేయంగా కారైకాల్‌కు 630 కి.మీ, చెన్నైకి 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. రాగల 48 గంటల్లో తమిళనాడు-దక్షిణకోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించారు. రేపు, ఎల్లుండి అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే, వచ్చే బుధవారం వరకు తీరం వెంట గంటకు 45-55 కి.మీ, గరిష్ఠంగా 65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. ముందస్తు చర్యల కోసం సంబంధిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది.

సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని చెప్పారు. మరోవైపు, తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాగల రెండు రోజుల్లో రాత్రి సమయంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు వివరించారు.

వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలు

  • రేపు, ఎల్లుండి దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
  • రాయలసీమలోని చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
  • దక్షిణ కోస్తా, రాయలసీమలో మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..