ఏపీలో బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగింది: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
బీజేపీ ఉత్తరాది పార్టీ కనుక దక్షిణాదిలో పనేంటని అడుగుతున్నారని.. హిందీ మాట్లాడని రాష్ట్రాలలోనూ తాము అధికారంలో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు రాజ్‌నాథ్ సింగ్.

Rajnath Singh
Rajnath Singh: సౌత్, నార్త్ ఇండియా పేరుతో విభజన కోసం రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. విశాఖపట్నంలో మంగళవారం జరిగిన భారత్ రైజింగ్ ఎలైట్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాష, ప్రాంతీయ వాదం పేరుతో సమగ్రతకు నష్టం కలిగించే చర్యలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగిందని.. ఏదోకరోజు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీ ఉత్తరాది పార్టీ కనుక దక్షిణాదిలో పనేంటని అడుగుతున్నారని.. హిందీ మాట్లాడని రాష్ట్రాలలోనూ తాము అధికారంలో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
”అనేక రాష్ట్రాలలో సెకండ్ ప్లేస్ బీజెపీదే. కుటుంబ పాలన, అవినీతికి కాంగ్రెస్ పార్టీ అమ్మ లాంటిది. రఫెల్ విమానాలను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే-దేశీయ నైపుణ్యంతో అద్భుతమైన ఉత్పత్తిని సాధిస్తున్నాం. దీర్ఘకాలిక ప్రయోజనాలు కోసం బీజేపీ పని చేస్తుంది. డిజిటల్ ఎకనామిలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. 400 విశ్వ విద్యాలయాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశాం. బ్యాంకింగ్ రంగంలో కొత్త సంస్కరణలు అమలు చేశాం. అవినీతిని సమూలంగా నిర్మూలించామ”ని రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.
పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి బదులు లాభాల బాటలో నడిపించేందుకు స్టీల్ మినిస్టర్ ప్రయత్నిస్తూ ఉన్నారని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడం వల్లే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యం అయిందని చెప్పారు.
Also Read: పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని జనసేన నేతలు రోడ్డున పడ్డారు: ఎంపీ మార్గాని భరత్