AP Rajyasabha: మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారు.. ఏకగ్రీవమే?

కూటమి తరపున ఎంపికైన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు ఇవాళ మినేషన్ దాఖలు చేయనున్నారు.

AP Rajyasabha: మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారు.. ఏకగ్రీవమే?

Krishnaiah, Mastan Rao, Sana Satish,

Updated On : December 10, 2024 / 9:12 AM IST

Rajya Sabha bypolls : ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యులుగాఉన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలు రాజ్యసభ సభ్యత్వాలకు, వైసీపీకి రాజీనామా చేశారు. వీరిలో బీదర మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. అయితే, ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నేటితో (డిసెంబర్ 10)తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో సోమవారం బీజేపీ అధిష్టానం తమ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్యను ఎంపిక చేయగా.. టీడీపీ అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీశ్ పేర్లను చంద్రబాబు ప్రకటించారు. దీంతో రాజీనామా చేసిన ముగ్గురిలో మోపిదేవి మినహా మిగిలిన ఇద్దరు మళ్లీ రాజ్యసభకు వెళ్లనున్నారు.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు

కూటమి తరపున ఎంపికైన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు ఇవాళ ఉదయం 11గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీకి బలం లేకపోవడంతో మూడు రాజ్యసభ స్థానాలు కూటమికే ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. బీజేపీ స్థానంలో జనసేన అభ్యర్థిని రాజ్యసభకు పంపిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. ఇందుకోసం పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. కానీ, కూటమి తరపున బీజేపీ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఇద్దరు రాజ్యసభకు వెళ్లబోతున్నారు. అయితే, నాగబాబును ఏపీ క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Manchu Family Dispute: అందుకే నాపై అసత్య ఆరోపణలు.. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన మంచు మనోజ్

బీజేపీ కోసం ఏపీ క్యాబినెట్ లో ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంది. జనసేన స్థానంలో రాజ్యసభకు బీజేపీ నుంచి అభ్యర్థిని ఎంపిక చేయడంతో ఏపీ కేబినెట్ లో బీజేపీ కోటాలో ఉన్న మంత్రి పదవిని జనసేనకు కేటాయించనున్నారు. ఈ క్రమంలో త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి 25వ మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ శాఖను నాగబాబుకు కేటాయిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.