Manchu Family Dispute: అందుకే నాపై అసత్య ఆరోపణలు.. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన మంచు మనోజ్

కుటుంబ ఆస్తులకోసం నేను ఎప్పుడూ ఆశ పడలేదు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను. ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా లాగడం చాలా బాధాకరమని మనోజ్ పేర్కొన్నారు.

Manchu Family Dispute: అందుకే నాపై అసత్య ఆరోపణలు.. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన మంచు మనోజ్

Manchu Family Dispute

Updated On : December 10, 2024 / 8:15 AM IST

Manchu Manoj : సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. మోహన్ బాబు, ఆయన రెండో కుమారుడు మనోజ్ మధ్య వివాదం తారాస్థాయికి చేరడంతో ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. తన తండ్రి మోహన్ బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ లో మూడు పేజీల లేఖను పోస్టు చేశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. నాతోపాటు నా భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మనోజ్ కోరారు. కుటుంబ ఆస్తులకోసం నేను ఎప్పుడూ ఆశ పడలేదు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను. ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా లాగడం చాలా బాధాకరమని మనోజ్ పేర్కొన్నారు.

Also Read: Manchu Family Dispute : ప్రాణహాని ఉంది- పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రీ కొడుకులు మోహన్ బాబు, మనోజ్..

గత కొన్నాళ్లుగా మా కుటుంబంకు దూరంగానే ఉంటున్నాం. నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారు. ఇంటిలో ఉండాల్సిన సీసీ ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయి. నా అన్న విష్ణు దుబాయ్ కి ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారు. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి, కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఆస్తులకోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదు. ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నేను, నాభార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామని మనోజ్ తెలిపారు.

Also Read: Naga babu : ఏపీ క్యాబినెట్ లోకి నాగబాబు..! జనసేన నుంచి మంత్రిగా త్వరలో బాధ్యతల స్వీకరణ..!

విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. విద్యాసంస్థలోని బాధితులకు నేను అండగా ఉన్నాను. బాధితుల పక్షాన నిలబడ్డందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ ఆరోపించారు.