Naga babu : ఏపీ క్యాబినెట్ లోకి నాగబాబు..! జనసేన నుంచి మంత్రిగా త్వరలో బాధ్యతల స్వీకరణ..!
నాగబాబుకు ఏ శాఖ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Naga Babu (Photo Credit : Google)
Naga Babu : సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు చంద్రబాబు బంపరాఫర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును ఏపీ క్యాబినెట్ లోకి తీసుకోనున్నారు. త్వరలోనే జనసేన తరపున మంత్రిగా నాగబాబు బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. ఎన్నికల వేళ నాగబాబు యాక్టివ్ గా పని చేశారు. కూటమి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు నాగబాబు.
జనసేన పార్టీలోనూ చాలా కీలకంగా పని చేశారు నాగబాబు. క్యాడర్ ను ఏకం చేయడంలో ఆయనది చాలా పెద్ద రోల్ అని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాగా, నాగబాబుకు ఏ శాఖ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
జనసేన నుంచి ఇప్పటికే చంద్రబాబు క్యాబినెట్ లో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ మంత్రులుగా ఉన్నారు. నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ఎమ్మెల్సీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్సీని చేశాక నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటారని సమాచారం. కాగా, నాగబాబుకు ఏదో ఒక కీలక పదవి ఇవ్వాలనే విషయంలో పవన్ కల్యాణ్ చాలా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. నాగబాబు అనకాపల్లి సీటును త్యాగం చేశారు. అంతేకాదు ఎంపీ సీటును కూడా త్యాగం చేశారాయన. ఈ క్రమంలో నాగబాబుకు కచ్చితంగా ఏదో ఒక కీలక పదవి ఇస్తారని ముందు నుంచి వినిపిస్తున్న మాట.
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే..
అటు టీడీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. బీద మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లను టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఇక, రాజ్యసభ అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
కూటమి రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు..
టీడీపీ నుంచి సానా సతీశ్, బీద మస్తాన్ రావు
బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్యకు అవకాశం
ఏపీ క్యాబినెట్ లోకి మెగా బ్రదర్ నాగబాబు
అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు..
ఏపీ క్యాబినెట్ లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక బెర్త్.. నాగబాబు భర్తీ చేయాలని నిర్ణయం..
ఏపీ క్యాబినెట్ లో జనసేనకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చినట్లు అవుతుంది
ఇప్పటికే జనసేన నుంచి మంత్రులుగా ఉన్న పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహన్, కందుల దుర్గేశ్..
Also Read : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు..!