Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు..!
రెండుసార్లు ఆగంతకుడు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు హోంమంత్రి అనితకు తెలిపారు డీజీపీ.

Pawan Kalyan (Photo Credit : Google)
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ ను చంపేస్తానంటూ ఆగంతకుడు రెండుసార్లు ఫోన్ చేశాడు. పవన్ పై అభ్యంతరకర భాషతో మేసేజ్ లు పంపించాడు. బెదిరింపు కాల్స్, మేసేజ్ లను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు సిబ్బంది. బెదిరింపుల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు పవన్. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి వచ్చిన బెదిరింపు కాల్స్ పై డీజీపీతో హోంమంత్రి అనిత మాట్లాడారు.
రెండుసార్లు ఆగంతకుడు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు హోంమంత్రి అనితకు తెలిపారు డీజీపీ. నెంబర్ ను వెంటనే ట్రేస్ చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు హోంమంత్రి అనిత. ప్రజాప్రతినిధుల పట్ల ఈ విధమైన చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. పవన్ ను చంపేస్తామంటూ హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం, అసభ్య పదజాలంతో సందేశాలు పంపడం అనేది చర్చనీయాంశంగా మారింది. బెదిరింపు కాల్స్, సందేశాల అంశాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి, పోలీసుల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు డీజీపీ. అటు హోంమంత్రి అనిత కూడా వెంటనే స్పందించారు. డీజీపీతో మాట్లాడారు. బెదిరింపు కాల్స్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది? అనేది ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.
Also Read : సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సైలెంట్ మోడ్.. గుంటూరు ఈస్ట్ వైపు అడుగులు