Diamond: ఆ కుటుంబం చేతికి చిక్కిన అరుదైన, రూ.60 లక్షల వజ్రం.. కొనేందుకు వచ్చిన వ్యాపారులు

గుడిమెట్లలో చాలా కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా వజ్రాలు వెతికే పనుల్లో బిజీగా ఉంటున్నాయి. ఒక్క వజ్రం జీవితాన్ని మార్చేస్తోంది.

Diamond: ఆ కుటుంబం చేతికి చిక్కిన అరుదైన, రూ.60 లక్షల వజ్రం.. కొనేందుకు వచ్చిన వ్యాపారులు

Diamond

Updated On : August 13, 2023 / 4:56 PM IST

Diamond – Gudimetla: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలంలో గుడిమెట్లలో ఓ వ్యక్తి వజ్రం దొరికింది. అది షడ్భుజి వజ్రం (Hexagon diamond shape). సత్తెనపల్లి దగ్గర బిగుబండ గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి ఈ వజ్రం దొరికింది.

గుడిమెట్లలో వజ్రాలు కోసం వెతుకుతున్న సమయంలో వారికి లభ్యమైంది. ఆ వజ్రం విలువ దాదాపు రూ.50 – రూ.60 లక్షల మధ్య ఉంటుందని అంచనా. దీంతో ఆ కుటుంబంతో 40 లక్షలకు ఇస్తామని వజ్రాల వ్యాపారులు బేరసారాలు ఆడుతున్నారు. గుడిమెట్లలో చాలా కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా వజ్రాల వెతికే పనుల్లో బిజీగా ఉంటున్నాయి.

గుడిమెట్ల వేదికగా అప్పట్లో రాజుల పరిపాలన ఉండేది. కొన్ని నెలలుగా గుడిమెట్లకు వజ్రాల వేట కోసం జనాల సంఖ్య భారీగా పెరిగింది. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా వజ్రాల కోసం వెతుకుతున్నారు.

చాలా మందికి వజ్రాలు దొరుకుతున్నాయని ప్రచారం జరుగుతుండడంతో ఆశగా జనాలు వస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే జీవితం మారిపోతుందని ఆశ పడుతున్నారు. భోజనాలు తమ వెంట తెచ్చుకుని ఇక్కడే తింటూ వెతుకులాటను కొనసాగిస్తున్నారు. ఇటీవల ఒక్కరోజులో మూడు వజ్రాల దొరికాయని సమాచారం.

Top music director : సౌత్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ అత‌డేనా..? సినిమాకి రూ.10కోట్లు..?