RGUKT AP Merit List: ఏపీలో ఆర్జీయూకేటీ ట్రిఫుల్ ఐటీ ప్రవేశ ఫలితాలు విడుదల.. ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్

ఏపీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ఐఐఐటీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

RGUKT AP Merit List: ఏపీలో ఆర్జీయూకేటీ ట్రిఫుల్ ఐటీ ప్రవేశ ఫలితాలు విడుదల.. ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్

AP RGUKT IIIT Results 2023

Updated On : July 13, 2023 / 12:08 PM IST

AP RGUKT IIIT Results 2023 : రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో(RGUKT)లో 2023 -2024 ఏడాది ప్రవేశాలకు అర్హులైన ఇంటిగ్రేటెడ్ కోర్స్ ల విద్యార్థుల జాబితాను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) గురువారం విజయవాడలో విడుదల చేశారు. ట్రిఫుల్ ఐటీలకు అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం(Srikakulam), నూడివీడు, ఒంగోలు(Ongole), ఇడుపులపాయలో ఉన్న 4 ట్రిఫుల్ ఐటీల్లో 4400 సీట్లు ఉన్నాయని చెప్పారు. ఆరు సంవత్సరాల పాటు ఈ ట్రిపుల్ ఐటీ (IIIT) కోర్సు చదవాల్సి ఉంటుంది.

ఈ నెల 20 నుంచి 25 వరకు కౌన్సెలింగ్ జరుగుతుందని, 10 వ తరగతి ఫలితాలు ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయని.. ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఉండవని వెల్లడించారు. టెన్త్ లో మెరిట్ సాధించిన విద్యార్థులకు ప్రవేశం కచ్చితంగా దొరుకుతుందని చెప్పారు. 4400 సీట్లుకు 38355 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని.. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థి మార్కులు 659 అని తెలిపారు. టాప్ టెన్ సీట్స్ సంపాదించినా వారంతా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులేనని వెల్లడించారు. గత ఏడాది ఇంజినీరింగ్ కోర్సు ప్రారంభించామని వచ్చే ఏడాది phd కూడా ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.

నాలుగు క్యాంపస్ ల్లో ఎలాంటి సమస్యలు లేవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆర్జీయూకేటీల్లో కొద్దిపాటి సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారాయన. 100 శాతం అధ్యాపకులను నియమిస్తామని హామీయిచ్చారు. ఒంగోలు క్యాంపస్ నిర్మాణం త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ఒంగోలులో అకామిడేషన్ సమస్య వుందని.. త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు.

Also Read: ఆగస్ట్ చివరి వారంలో ఆదిత్య ఎల్1 రాకెట్ ప్రయోగం.. ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి