Roja: పవన్ కల్యాణ్ చిన్న మెదడు అంతా.. అంటూ రోజా సెటైర్లు
తిరుపతిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో రోజా పాల్గొని మాట్లాడారు. పవన్, చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు.

Roja -Pawan Kalyan
Roja -Pawan Kalyan: జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ చిన్న మెదడు చితికిపోయిందంటూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి రోజా సెటైర్లు వేశారు. అందుకే ఏపీలోని వాలంటీర్లపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. తిరుపతిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో రోజా పాల్గొని మాట్లాడారు.
” వాలంటీర్లు బయటి వ్యక్తులు కాదు. మీ ప్రాంతానికి చెందిన మీలోని వారినే వాలంటీర్లుగా నియమించారు. అలాగే, వాలంటీర్ గా పని చేయాలని, మరే పనీ చేయొద్దని చెప్పలేదు. వారు చదువుకుంటూ, వేరే పని చేస్తూ కూడా వాలంటీర్ గా ఉండచ్చు. వాలంటీర్ గా నే ఉండాలని వారిపై ఒత్తిడి చేయడం లేదు ” అని రోజా అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసినప్పటికీ ప్రజల కోసం ఆయన ఏమీ చేయలేదని రోజా అన్నారు. ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆయన మామను, ఇటు ప్రజలను మోసం చేశారని రోజా అన్నారు. కాగా, వాలంటీర్లపై ఇటీవల పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ఇప్పటికే వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Congress: 5 రాష్ట్రాలకు కొత్త మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం.. ఏపీకి ఎవరో తెలుసా?