Roja: సిగ్గు లేకుండా గంట కొట్టండి, విజిల్స్ వేయండి అంటారా?: మంత్రి రోజా కామెంట్స్
ఏపీలో పెద్ద సైకోలు బ్రాహ్మణి తండ్రి, మామ బాలకృష్ణ , చంద్రబాబేనని మంత్రి రోజా అన్నారు.

Nara Brahmani, Roja
Roja: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కోడలు నారా బ్రాహ్మణి తెలియక మాట్లాడుతున్నారా? తెలిసే అబద్ధాలు చెబుతున్నారా? అంటూ మంత్రి రోజా మండిపడ్డారు. ఇవాళ ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు దొరికిపోయి జైల్లో కూర్చున్నారని వ్యాఖ్యానించారు.
ఆయనకు మద్దతుగా నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని.. గంట కొట్టండి, విజిల్స్ వేసి జగన్ కు బుద్ధి చెప్పండని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణితో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ ప్రజల సొమ్ము తిన్నారని చెప్పారు. ఏపీలో పెద్ద సైకోలు బ్రాహ్మణి తండ్రి, మామ బాలకృష్ణ, చంద్రబాబేనని అన్నారు.
జగన్ గురించి ఇంకోసారి మాట్లాడితే బ్రాహ్మణికి మర్యాద దక్కదని మండిపడ్డారు. ఇన్ని రోజులు బ్రాహ్మణి రాజకీయం గురించి మాట్లాడలేదు కాబట్టి, ఆమె గురించి తాను మాట్లాడలేదని రోజా అన్నారు. హైదరాబాద్ కే పరిమితమైన కుటుంబాన్ని ప్రజలు మళ్లీ ఏపీలోకి రాకుండా చేస్తారని బ్రాహ్మణిపై రోజా విమర్శలు గుప్పించారు.
రోజా గురించి జుగుప్సాకరంగా మాట్లాడారు..
టీడీపీ నేత బండారు సత్యనారాయణను అరెస్టు చేయాలంటూ ఏపీ డీజీపీకి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. మంత్రి రోజా గురించి ఆయన జుగుప్సాకరంగా మాట్లాడారని చెప్పారు. సభ్య సమాజం తలదించుకునే కామెంట్స్ చేశారని అన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి బండబూతులు మాట్లాడుతున్నారని, దీన్ని ఉపేక్షించరాదని చెప్పారు.
Balakrishna: ఈ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం: బాలకృష్ణ, అచ్చెన్నాయుడు