ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్.. బిల్డింగ్ ఓనర్స్ దగ్గర మస్ట్‌గా ఇది తీసుకోవాలి..

ప్రతి మనిషి జీవితంలో సొంత ఇల్లు కొనాలని/కట్టుకోవాలని ఆశిస్తాడు.

ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్.. బిల్డింగ్ ఓనర్స్ దగ్గర మస్ట్‌గా ఇది తీసుకోవాలి..

Updated On : February 27, 2025 / 7:10 PM IST

కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి మార్గదర్శకాలను పురపాలకశాఖ విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో తాజా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్యుపేషన్ సర్టిపికెట్ పై భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. నివాసయోగ్య పత్రం చూశాకే బ్యాంకులు నిర్మాణాలపై రుణాలు ఇవ్వాలన్న నిబంధనల వంటివి అందులో ఉన్నాయి.

Also Read: పాక్‌, బంగ్లా మ్యాచ్‌ వర్షార్పణం.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్లు ఏవో తెలుసా? నెక్స్ట్‌ ఏంటి?

ప్రతి మనిషి జీవితంలో సొంత ఇల్లు కొనాలని/కట్టుకోవాలని ఆశిస్తాడు. సొంత ఇల్లు కోసం ఎంతో కష్టపడతాడు. సొంత ఇల్లు ఉంటే స్వేచ్ఛగా, ఆనందంగా జీవించగలమని భావిస్తాడు. అద్దె ఇంట్లో ఉండే వ్యక్తి ప్రతినెలా అద్దె కట్టాల్సి ఉంటుంది. అంతేగాక, ఇంటి యజమాని ఖాళీ చేయాలని ఆదేశిసత్ఊ ఇంటిని ఖాళీ చేయాల్సి రావచ్చు. సొంత ఇల్లు ఉంటే అలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి కొత్త ఇల్లు కొనాలనుకునే వారు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా తెలుసుకోవాలి.

ప్రజలు అనధికార, అక్రమ నిర్మాణాల జోలికి పోకుండా పురపాలకశాఖ ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

ముఖ్యాంశాలు

  • ఆక్యుపేషన్ సర్టిఫికెట్‌పై బిల్డింగ్‌ ఓనర్‌ వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలి
  • ఆ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల్లోకి వచ్చేలా చూడాలి
  • బిల్డింగ్ నిర్మాణ ప్రణాళిక మంజూరు సమయంలోనే అండర్ టేకింగ్ తీసుకోవాలి
  • బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్లాన్ ప్రదర్శించాలి
  • అధికారులు బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాన్ని తనిఖీ చేయాలి
  • ప్లాన్ మేరకు నిర్మాణం లేకపోతే నివాసయోగ్య సర్టిఫికెట్ ఇవ్వకూడదు
  • డీవియేషన్ సరిచేసే వరకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వకూడదు
  • అలాంటి నిర్మాణాలకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇస్తే చర్యలు
  • నివాసయోగ్య సర్టిఫికెట్ ఇస్తేనే తాగునీరు, డైనేజీ, విద్యుత్ కనెక్షన్లు