RTC Bus Accident : అహోబిలం వద్ద లోయలోపడ్డ ఆర్టీసీ బస్సు.. 10మంది తీవ్రగాయాలు
కర్నూలు జిల్లాలోని అహోబిలం వద్ద ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Rtc Bus Accident
Ahobilam Rtc Bus Accident: ఏపీలోని కర్నూలు జిల్లాలోని అహోబిలం వద్ద ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎగువ అహోబిలం రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకుని సహాయకచర్యలు చేట్టారు. గాయపడివారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆళ్లగడ్డ నుంచి అహోబిలం క్షేత్రానికి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. తిరిగి వచ్చే సయమంలో బస్సును డ్రైవర్ బ్యాక్ చేస్తుండగా..అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.