Fire In RTC Bus: ఆర్టీసీ బస్సులో మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు..
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Fire In RTC Bus: కర్నూలు బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో మంటల్లో కాలి బూడిదైంది. అందులోని ప్రయాణికుల్లో కొందరు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన మరువక ముందే ఏపీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈసారి ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కృష్ణా జిల్లా నందిగామ దగ్గర ఆర్టీసీ బస్సుల్లో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అలర్డ్ అయ్యాడు. చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను కిందికు దించేశాడు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. బస్సు విజయవాడ నుంచి కోదాడకు వెళ్తోంది. బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆర్టీసీ సిబ్బంది మరో బస్సులో ప్రయాణికులను పంపేశారు.
