ఎన్టీఆర్‌ మరణానికి చంద్రబాబు, అశోక్‌ గజపతిరాజు కారణం

ఎన్టీఆర్‌ మరణానికి చంద్రబాబు, అశోక్‌ గజపతిరాజు కారణం

Updated On : January 18, 2021 / 12:31 PM IST

sanchaitha sensational comments against Ashok Gajapatiraju : సోషల్ మీడియాలో సంచయిత గజపతి మరోసారి విరుచుకుపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజుపై.. సంచయిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టుకుని సొంత కాళ్లమీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించి.. ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో చంద్రబాబుతో పాటు ఆశోక గజపతి రాజు ఉన్నారంటూ ఆరోపించారు.

చంద్రబాబు, అశోక్‌ గజపతి రాజు సహా ఐదుగురిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్‌ అప్పట్లో రాసిన లేఖను.. ఆమె షేర్‌ చేశారు. ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో లేఖలో ఎన్టీఆర్ చెప్పారన్న సంచయిత.. రాజకీయ సూత్రాలు, నైతిక విలువలను, ప్రజల తీర్పును ఆశోక్ గజపతిరాజు మంటగలిపారని ఆరోపించారు.

ఎన్టీఆర్‌ ఆరాధ్యదైవమంటూ.. ఆయన వర్థంతి రోజున కొనియాడటం.. ఒక వ్యక్తిని హత్యచేసి.. అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చిడం విడ్డూరమంటూ సోషల్ మీడియాలో సంచయిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.