నేను ఈస్థాయిలో ఉండటానికి వైఎస్ఆరే కారణం

నేను ఈస్థాయిలో ఉండటానికి వైఎస్ఆరే కారణం

Updated On : January 30, 2021 / 12:29 PM IST

SEC Nimmagadda praised YSR : వైఎస్ఆర్ పై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్యాంగ వ్యవస్థపై ఆయనకు ఎంతో గౌరవం ఉండేదన్నారు. వైఎస్సార్ ఆశీస్సులు తనకు ఎక్కువగా ఉండేవన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి వైఎస్ఆర్ కారణమని తెలిపారు. ఆయనంటే తనకు చాలా గౌరవం ఉందన్నారు. వైఎస్ఆర్ తనను ఫైనాన్స్ సెక్రటరీగా నియమించారని తెలిపారు.

తాను రాజ్యాంగబద్ధంగానే వ్యవరిస్తున్నానని, విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రకటించారు. నిజాయితీగా తన అభిప్రాయాలను చెబుతానని పేర్కొన్నారు. తనపై విమర్శలు చేయవద్దని కోరారు. ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి లేదన్నారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగుతాయని తెలిపారు.

పంచాయతీ ఎన్నికల్ని ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. ఎన్నికలను అడ్డుకునేందుకు హైకోర్టులో 10 కేసులు వేశారని తెలిపారు. తాను చేసిన తప్పేంటో అర్థం కావడం లేదన్నారు.