Chandrababu Arrest: చంద్రబాబు తరపున వాదించనున్న సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా.. అమరావతి, వివేకా హత్యకేసులో..

గతంలో అమరావతి భూముల కేసును కూడా లూథ్రానే వాదించారు. అదేవిధంగా చంద్రబాబు ఇతర కేసులనూ సిద్ధార్థ్ లూథ్రా చూస్తున్నారు. వివేకా హత్య కేసులోనూ సునీత తరపున వాదనలు సిద్ధార్థ్ లూథ్రా వినిపించారు.

Chandrababu Arrest: చంద్రబాబు తరపున వాదించనున్న సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా.. అమరావతి, వివేకా హత్యకేసులో..

Sidharth Luthra

Chandrababu Arrest In Skill Development case: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబును ప్రత్యేక కాన్వాయ్ ద్వారా రోడ్డుమార్గంలో అమరావతి వద్ద కుంచనపల్లిలో సిట్ కార్యాలయంకు తరలించారు. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ కుంచనపల్లి చేరుకోవటానికి దాదాపు తొమ్మిది గంటల సమయం పట్టింది. దారిపొడువునా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ ముందును నడిపించారు. పలు ప్రాంతాల్లో భారీగా టీడీపీ శ్రేణులు కాన్వాయ్‌ను అడ్డుకోవటంతో చంద్రబాబే స్వయంగా పక్కకు తప్పుకోవాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.

Gorantla Madhav : చంద్రబాబు నిజాయతీ పరుడని చెప్పేందుకు ఎవరైనా చర్చకు వస్తారా? ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్

ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ పిటీషన్ పై వాదనలు జరగనున్నాయి. అయితే, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్ర వాదించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆయన విజయవాడకు చేరుకున్నారు. మరోవైపు సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్, వివేకానంద వాదనలు వినిపించనున్నారు. అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా సుప్రింకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నారు. గతంలో అమరావతి భూముల కేసును కూడా లూథ్రానే వాదించారు. అదేవిధంగా చంద్రబాబు ఇతర కేసులనూ సిద్ధార్థ్ లూథ్రా చూస్తున్నారు. వివేకా హత్య కేసులోనూ సునీత తరపున వాదనలు సిద్ధార్థ్ లూథ్రా వినిపించారు. చాలా మంది ప్రముఖుల కేసుల్లో లూథ్రా  వాదనలు వినిపించారు.

Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్‌పై పవన్ సంచలన వ్యాఖ్యలు

లూథ్రా దేశంలోని అగ్రశ్రేణి క్రిమినల్ లాయర్లలో ఒకరు. మూడు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. లూథ్రా 2004 నుంచి 2007 వరకు సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా ఢిల్లీ హైకోర్టులో భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించారు. 2007లో సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. అతను తన ప్రాక్టీస్‌ను 2010లో ఢిల్లీ హైకోర్టు నుండి భారత సుప్రీం కోర్టుకు మార్చాడు. పలు కీలక కేసులను లూథ్రా వాధించారు.