Andhra Pradesh : సాక్ష్యాలు బయటపెడితే ‘గవర్నమెంట్ షేక్ అవుతుంది’..ఐపీఎస్‌ల ఉద్యోగాలు ఊడుతాయ్ : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పెను సంచలన కలిగిస్తున్నాయి. నా ఫోన్ ట్యాంపింగ్ జరుగుతోంది అంటూ కోటం రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్న వేళ దానికి సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని ఆ సాక్ష్యాలు బయటపెడితే ఏపీ గవర్నమెంట్ షేక్ అవుతుంది అంటూ ఆటంబాబు పేల్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ సాక్ష్యాలు బయటపెడితే ఐపీఎస్ ల ఉద్యోగాలు ఊడుతాయన్నారు.

Sensational comments of Nellore Rural YCP MP Kotamreddy Sridhar Reddy
Andra Pradesh : ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పెను సంచలన కలిగిస్తున్నాయి. నా ఫోన్ ట్యాంపింగ్ జరుగుతోంది అంటూ కోటం రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్న వేళ దానికి సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని ఆ సాక్ష్యాలు బయటపెడితే ఏపీ గవర్నమెంట్ షేక్ అవుతుంది అంటూ ఆటంబాబు పేల్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ సాక్ష్యాలు బయటపెడితే ఐపీఎస్ ల ఉద్యోగాలు ఊడుతాయన్నారు.
రెండుసార్లు నాపై ఉన్న గౌరవంతో జగన్ నాకు టికెట్ ఇచ్చారు. ఆయనపై నాకు గౌరవం ఉంది అంటూనే ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు బయటపెడితే సెంట్రల్ నుంచి ఎంక్వైరీ వచ్చా నానా యాగీ అవుతుందని అన్నారు. నమ్మకం లేనిచోట నేను ఉండనని స్పష్టంచేసిన కోటం రెడ్డి డిసెంబర్ 23 వరకు నాకు పార్టీ మారాలనే ఆలోచనే లేదు. కానీ ఆ తరువాత నాకు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని తెలిసిందనీ..పార్టీ మారాలనుకుంటున్నానని..2024లో టీడీపీ తరపు నుంచి పోటీకి దిగుతాను నెల్లూరు రూరల్ నుంచే పోటీకి దిగుతాను అంటూ కోటం రెడ్డి స్పష్టంచేశారు. ఫోన్ ట్యాపింగ్ తో తన మనసు కలత చెందిందన్నారు.
కంటి నిండా కునుకు లేకుండా చేస్తోందని వాపోయారు. అనుమానం ఉన్నచోట కొనసాగడం కష్టమన్నారు. రాజకీయాలు తనకు కొత్త కాదన్నారు. దీంతో ఇక కోటంరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి ఇక పసుపు కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించటంతో నెల్లూరు వైసీపీలో ముసలం రాజుకోవటమేకాదు..ఏకంగా వైసీపీలోనే కోటం రెడ్డి వ్యాఖ్యలు షేక్ చేస్తున్నాయి.
of